Share News

AP Politics: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ.. ఈ సారి ఏం చేసిందంటే....?

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:41 PM

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్‌ మీనాకి తెలుగుదేశం సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్(MA Sharif) మంగళవారం నాడు ఓ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా, గడికోటకు చెందిన మునియ్యపై వైసీపీ(YSRCP) మూకలు దాడి చేసి హత్య చేసిన ఘటనపై లేఖలో సీఈఓకు వివరించారు. మునియ్యపై వైసీపీ మూకలు సోమవారం అతి దారుణంగా దాడి చేశారని చెప్పారు. మునియ్య తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే కారణంతోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారని చెప్పారు.

AP Politics: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ.. ఈ సారి ఏం చేసిందంటే....?

అమరావతి: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్‌ మీనాకి తెలుగుదేశం సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్(MA Sharif) మంగళవారం నాడు ఓ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా, గడికోటకు చెందిన మునియ్యపై వైసీపీ(YSRCP) మూకలు దాడి చేసి హత్య చేసిన ఘటనపై లేఖలో సీఈఓకు వివరించారు. మునియ్యపై వైసీపీ మూకలు సోమవారం అతి దారుణంగా దాడి చేశారని చెప్పారు. మునియ్య తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే కారణంతోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన మునియ్యకు గిద్దలూరిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌లో మునియ్య చికిత్స పొందుతూ ఈరోజు ఉదయాన్నే మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ దాడులు పేట్రేగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేతలు, సానుభూతిపరులపై దాడులు చేస్తున్న వారిని ఉక్కుపాదంతో అణచివేయకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు. మునియ్య హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ విచక్షణ రహితంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు. మాచర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. మార్చి 18వ తేదీన రాత్రి టీడీపీ నాయకుడు వీర్ల సురేష్ కారును తగులబెట్టారని అన్నారు. చీదిగుమ్మల గ్రామంలో ఓ ఇంటిపై వైసీపీ జెండా ఎగురవేయలేదని ఆ కుటుంబ సభ్యులపై ఆ పార్టీ గూండాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ధ్వజమెత్తారు. ఈ దాడులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని.... రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని లేఖలో షరీఫ్ కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 10:54 PM