Chandrababu Naidu: రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరనున్న వైసీపీ నేతలు..
ABN , Publish Date - Mar 01 , 2024 | 08:23 PM
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ( శనివారం ) నెల్లూరులో పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగే భారీ సమావేశానికి హాజరు కానున్నారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( (Chandrababu Naidu) రేపు ( శనివారం ) నెల్లూరులో పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగే భారీ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ప్రదర్శించారు. చంద్రబాబు సమక్షంలో ఎంపీ వీపీఆర్ దంపతులు టీడీపీలో చేరనున్నారు. వారితో పాటు వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పసుపు జెండా కప్పుకోనున్నారు. పసుపుమయంగా మారిన వీపీఆర్ కన్వెన్షన్ వద్ద మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.
నెల్లూరుతో పాటు చంద్రబాబునాయుడు రాప్తాడులో పర్యటించనున్నారు. 4న రాప్తాడులో పర్యటిస్తారు. ‘‘రాకదలి రా’’ సభలో పాల్గొంటారు. ఇప్పటికే 22 రా కదలి రా సభల్లో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతి పార్లమెంట్‌లో ఒక రా కదలి రా సభను తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.