Share News

YSRCP: తిరుపతిలో వైసీపీకి షాక్.. టీడీపీ. జనసేనలోకి ఇద్దరు కార్పొరేటర్లు

ABN , Publish Date - May 05 , 2024 | 01:33 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) రాష్ట్ర వ్యాప్తంగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా తిరుపతికి చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన కండువా కప్పుకుంటున్నారు.

YSRCP: తిరుపతిలో వైసీపీకి షాక్.. టీడీపీ. జనసేనలోకి ఇద్దరు కార్పొరేటర్లు

తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) రాష్ట్ర వ్యాప్తంగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా తిరుపతికి చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన కండువా కప్పుకుంటున్నారు. తిరుపతి 30, 31 డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కల్పన యాదవ్, రేవతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

కల్పన టీడీపీలో చేరగా, రేవతి జనసేనలో చేరారు. వారితోపాటు ముగ్గురు కీలక నేతలు కూడా వైసీపీని వీడారు.


వారి ఆగడాల అంతానికి నాంది..

వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారని జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు ఆరోపించారు. బెదిరించి టీడీపీలోంచి వైసీపీలోకి నేతలను లాగారని ఇప్పుడు వారి రాక్షసపాలన నచ్చలేక వారంతా తిరిగి వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు.

దొంగ ఓట్లు వేయడానికి 30 వేల మందిని వైసీపీ రప్పించిందని.. పోలింగ్ రోజు వారిని పట్టిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుగుణమ్మ మాట్లాడుతూ.. "భూమన ఆయన కుమారుడి రాజకీయ పతనం ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు బారులు తీరడం బాధాకరం. టీడీపీలోకి రానున్న రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలో మరింత మంది చేరబోతున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం" అని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌కు మరో షాక్.. ఇద్దరు డిఎస్పీల బదిలీ..

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 01:34 PM