Share News

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:49 PM

రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు.

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

ఏలూరు: రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (Purandeswari) పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రస్తుతం ఉత్తరాయణం వచ్చిందని.. దీనిలో పండుగలు ఎక్కువగా ఉంటాయన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటే భక్తులు ఇబ్బందులు పడతారన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధులకు వాడకుండా భక్తుల సేవలో మాత్రమే ఉపయోగించేలా చూడాలని ఎలక్షన్ కమిషన్‌ను పురందేశ్వరి కోరారు.

Andhra Pradesh: వైసీపీ ముఖ్య నేతకు బీజేపీ లీడర్ సీరియస్ వార్నింగ్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌‌సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం తను పోటీ చేస్తున్న పార్లమెంటు స్థానానికి వచ్చారు. ఆమె 8వ తేదీ వరకూ అక్కడే ఉండనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుని అక్కడ వేంకటేశ్వరస్వా మికి పూజ నిర్వహిస్తారు. 12 గంటలకు రాజమహేం ద్రవరం చేరుకుని వివిధ వర్గాలతో సమావేశమవు తారు. 6వ తేదీన ఉదయం 10.30 గంటలకు పార్ల మెంటరీ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు.ఏవీ అప్పా రావు రోడ్డు చివరలో పాత ఎస్పీ ఆఫీసుకు ఎదురుగా 2014లో మాగంటి మురళీమోహన్‌ ఆఫీసుగా నిర్వహిం చిన భవనాన్నే పురందేశ్వరి తీసుకున్నారు. దీని ప్రారంభానికి అసెంబ్లీ అభ్యర్ధులు, పార్టీ నాయకులు హాజరవుతారు. తర్వాత బీజేపీ కార్యకర్తలతో మాట్లాడ తారు. 7వ తేదీన 10.30 గంటలకు రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం బీజేపీ, టీడీపీ, జనసేన నాయ కులతో సమావేశం నిర్వహిస్తారు. 4 గంటలకు రాజ మహేంద్రవరం రూరల్‌ మీటింగ్‌, 8న ఉదయం 10.30 గంటలకు రాజానగరంలో రాజానగరం అసెంబ్లీ మీటింగ్‌, సాయంత్రం కొవ్వూరు నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తారు.

Congress: ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వరాలు..

మరిన్ని ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 12:49 PM