Share News

AP Politics: జగన్‌ను వాలంటీర్లు కూడా వ్యతిరేకిస్తున్నారా?.. నెల్లూరులో ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:46 AM

Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వాలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కావలిలో టీడీపీ అభ్యర్ధి కావ్యా కృష్ణారెడ్డికి నలుగురు వాలంటీర్లు మద్దతు తెలిపారు. అయితే విషయం తెలిసిన అధికారులు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.

AP Politics: జగన్‌ను వాలంటీర్లు కూడా వ్యతిరేకిస్తున్నారా?.. నెల్లూరులో ఏం జరుగుతోంది?

నెల్లూరు, మార్చి 5: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వాలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై (Jagan Government) తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కావలిలో టీడీపీ అభ్యర్థి కావ్యా కృష్ణారెడ్డికి (TDP candidate is Kavya Krishna Reddy) నలుగురు వాలంటీర్లు (Volunteers)మద్దతు తెలిపారు. అయితే విషయం తెలిసిన అధికారులు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఆ నలుగురు వాలంటీర్ల తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగాలు వదిలేసేందుకు కూడా వాలంటీర్లు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

YCP Govt.: నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ ప్రభుత్వం అరాచకం...


ఏబీఎన్ చేతిలో వీడియోలు..

కాగా.. మరోవైపు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (MLA Ramireddy Pratap Kumar Reddy) నివాసంలో అత్యవసరంగా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించారు. ఒక్కో వాలంటీర్‌కు రూ.5వేలు నగదు, దుస్తులు, చీరలు పంపణీ చేస్తున్నట్లు సమాచారం. పథకాలు రావంటూ ఓటర్లని బెదిరించి, వైసీపీకి ఓట్లు వేయించాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఎన్నికల అధికారులు తెరచాటు మద్దతు ఇస్తున్నట్లు వినికిడి. ఎమ్మెల్యే నివాసంలోనే పంపకాలు సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. కాగా.. ఎమ్మెల్యే నివాసంలో వాలంటీర్ల సమావేశాల వీడియోలు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతికి చిక్కాయి. ఓ వైపు కొందరు వాలంటీర్లు జగన్‌‌కు వ్యతిరేకంగానూ.. మరోవైపు వైసీపీకి మద్దుతుగా నిలవడంతో అసలు జిల్లాలో ఏం జరుగుతందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఇవి కూడా చదవండి...

TDP-Janasena: నేడు టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో బీసీ జయహో బహిరంగ సభ

AP News: ఎమ్మెల్యే, బామర్ది మాఫియా రాజ్యం.. కడపలో ముంబైని తలపించేలా అరాచకాలు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2024 | 10:31 AM