Share News

Nara Bhuvaneswari: ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన సీఎం జగన్

ABN , Publish Date - Mar 28 , 2024 | 09:52 PM

ఈ అరాచక జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే యువతకు భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర గురువారం విజయవాడలోని కానూరులో కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.

Nara Bhuvaneswari: ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన సీఎం జగన్

విజయవాడ: ఈ అరాచక జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే యువతకు భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర గురువారం విజయవాడలోని కానూరులో కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ...టీడీపీ కోసం‌ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. పార్టీ పరంగా తామంతా ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో‌ చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన్ని అన్యాయంగా అరెస్టు చేస్తే ఎక్కడెక్కడి‌వారో స్పందించారన్నారు. రాష్ట్ర విభజన పేరుతో సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతగానో తపన పడ్డారని అన్నారు.

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు


పోలవరం పనులు పరుగులు పెట్టించారని తెలిపారు. మళ్లీ చంద్రబాబు పాలన వచ్చి ఉంటే అమరావతి, పోలవరం అభివృద్ధి చేసేవారని చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టులు అటకెక్కాయన్నారు. ఇక రాజధాని లేకుండా చేసి అమరావతిని‌ చంపేశారని మండిపడ్డారు. మహిళల పట్ల కొంతమంది పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. వాళ్ల ఇళ్లళ్లో ఆడవాళ్లు ఉంటారనే ఇంగితం మరిచారన్నారు.ఇలాంటి దారుణ ప్రభుత్వంలో దమనకాండను‌ చూశామన్నారు. నేడు శాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి రవాణాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని.. ఇది ఈ ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పారు.

యువత గంజాయి మత్తులో అత్యాచారాలకు తెగ పడుతున్నారన్నారు. విశాఖలో 25వేల కిలోల డ్రగ్స్‌ దొరికినా నిస్సిగ్గుగా సమర్ధించు కుంటున్నారని చెప్పారు. మద్య నిషేధం అన్న వాళ్లు.. మద్యాన్ని అమ్ముకుని కోట్లు దోచుకున్నారని విరుచుకుపడ్డారు. కల్తీ, నాసిరకం మద్యంతో మహిళల పుస్తెలు తెంపి... వాళ్ల కన్నీళ్లతో కోట్లు కూడేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు ఎలా‌ దోచేస్తున్నారో చూస్తున్నామన్నారు. ప్రజలు బాగా ఆలోచించాలని.. రాక్షస ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడి జగన్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు.

AP News: అమరావతి రైతుల పోరాటంపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు


పోలీసులతో అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారన్నారు. ప్రజలంతా మీ‌కోసం, మీ బిడ్డల కోసం ఆలోచించాలన్నారు. గ్రామాల్లోకి వెళ్లి వైసీపీ నేతలు చేసే అరాచకాలను వివరించాలని కోరారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయేలా వైసీపీ నేతలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వంటి‌ దార్శనికుడు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పోలవరం పూర్తి, అమరావతి రాజధాని అభివృద్ధి, ఉద్యోగాల కల్పన చంద్రబాబు చేసి చూపుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకోని ఓటు వేయాలని కోరారు. చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదని.. అందుకే ఇప్పుడు జగన్ అక్రమ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్ల పాలన గుర్తు చేసుకుని జగన్‌కు తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, ఇచ్చిన ఉద్యోగాలు, రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు, ఐటీ అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఈసారి ప్రతి ఒక్కరూ ఏపీకి మంచి చేసేలా ఆలోచించి చంద్రబాబుకు ఓటు వేయాలని నారా భువనేశ్వరి కోరారు.

ఇవి కూడా చదవండి

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 09:52 PM