Share News

Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్ ట్విస్ట్.. వైఎస్ షర్మిలకు చెప్పకుండానే..

ABN , Publish Date - Feb 20 , 2024 | 03:33 PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్‌ ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి రాజకీయంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నాయని అన్నారు.

Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్ ట్విస్ట్.. వైఎస్ షర్మిలకు చెప్పకుండానే..

అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy) బిగ్‌ ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్ షర్మిల (YS Sharmila) సమక్షంలో రెండు నెలలక్రితం కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీలో జాయిన్ ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సమక్షంలో తిరిగి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి రాజకీయంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నాయని అన్నారు. ‘‘ 2024లో వైసీపీ 175 సీట్లు గెలుస్తాం. 25 పార్లమెంట్ గెలుస్తాం’’ అని ఆయన దీమా వ్యక్తం చేశారు.

‘‘ నేను తిరిగి వైసీపీలో జ‌గ‌న్ ద‌గ్గ‌ర చేరాను. పార్టీని 3వసారి గెలిపించ‌డానికి పార్టీలో జ‌గ‌న్ ద‌గ్గ‌ర చేరాను. పేద‌వాడు సంతోషంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీల జీవితాల్లో జగన్ వెలుగులు నింపుతున్నారు. ఈ ప్ర‌క్రియ‌లో నేను రెండు నెల‌లు దూరంగా ఉన్నానగ. ఇప్పుడు తిరిగి పార్టీలో చేరాను. జ‌గ‌న్ ఇంకో 20, 30 సంవ‌త్సారాలు అండ‌గా నిల‌బ‌డ‌గ‌లిగితే, ప్ర‌జ‌లు అండ‌గా ఉంటే పేద‌ల‌కు న్యాయం జ‌ర‌గుతుంది. వైనాట్ 175లో మేము కూడా భాగ‌స్వామి కావాలి. 25 పార్ల‌మెంటు స్థానాలు తిరిగి సాధించేందుకు కృషిచేస్తాను. మంగ‌ళ‌గిరిలో ఏ అభ్య‌ర్థిని ఇచ్చినా పూర్తిస్థాయిలో అన్ కండిష‌నల్‌గా ప‌నిచేస్తానని జ‌గ‌న్‌కు చెప్పాను. ప్ర‌తిప‌క్షాలు అన్ని కూడా రాజ‌కీయంగా ఏకం అయ్యాయే అలానే నేటి పరిస్థితి ఉంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సార‌ధ్యంలో అన్‌కండిష‌న‌ల్‌గా ప‌నిచేస్తాను. 2019లో నారా లోకేశ్ ఎలా ఓడిపోయారో 2024లో బీసీ అభ్య‌ర్థి చేతుల్లో నారాలోకేష్ ఓట‌మి చెందుతారు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి..

AP Politics: మళ్లీ నోటీసులు.. ఈసారైనా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వెళ్తారా?

YCP Goons: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వైసీపీ గుండాలు వారే..


Untitled-2.jpg

సీఎం జగన్‌ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ చెప్పింది!

‘‘సీఎం జగన్‌ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. అది నాకు నచ్చలేదు. జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు. అక్కడ పద్ధతి పాడు ఏమీ లేదు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ, షర్మిల విధానం అలా లేదు. కేవలం వ్యక్తిగతంగానే ఉంటుంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూశాను. కానీ వినలేదు. జగన్‌పై వ్యక్తిగతంగా వెళ్లడం నాకు నచ్చలేదు. అందుకే ఆమెతో నడవడం ఇష్టంలేక సొంత గూటికి వస్తున్నాను’’ అని సన్నిహితుల వద్ద ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 20 , 2024 | 04:10 PM