Share News

Srisailam: శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్న కన్నడ భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

ABN , Publish Date - Apr 04 , 2024 | 11:24 AM

Andhrapradesh: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేుకుంటున్నారు.

Srisailam: శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్న కన్నడ భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

నంద్యాల, ఏప్రిల్ 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు.

Alcohol: అబ్బో.. మార్చిలో మనోళ్లు తెగ తాగేశారుగా.. రికార్డు స్థాయిలో రూ.4,475 కోట్ల అమ్మకాలు


వందల కిలొమీటర్ల పాదయాత్ర చేస్తూ నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం శివనమస్మరణతో మారుమోగుతోంది. కన్నడిగుల రాకతో శ్రీశైలంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. ఉగాది ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువపందిళ్లు, తాగు నీటి వసతి, శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్యశిబిరాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు దేవస్థానం అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఇవి కూడా చదవండి...

Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!

PM Modi: 3 రోడ్‌షోలు.. 3 బహిరంగ సభలు.. నాలుగు రోజులపాటు మోదీ ప్రచారం


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 11:34 AM