Varla Kumar Raja : అలా చేయొద్దు.. వారికి ఎమ్మెల్యే వార్నింగ్
ABN , Publish Date - Jul 09 , 2024 | 09:09 PM
ప్రభుత్వ నూతన ఇసుక విధానం పేద వర్గాలు, కార్మిక వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా (Varla Kumar Raja) వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పూర్తితో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
కృష్ణా జిల్లా (పామర్రు): ప్రభుత్వ నూతన ఇసుక విధానం పేద వర్గాలు, కార్మిక వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా (Varla Kumar Raja) వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పూర్తితో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
ఈ నెల11వ తేదీ నుంచి పామర్రులో ప్రగతి పథం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈరోజు(మంగళవారం) వర్ల కుమార్ రాజా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఇసుక దోపిడీకి ఎవరైనా తెరలేపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా పారదర్శకంగా ఇసుక విధానం కొనసాగుతుందని అన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి గురువారం నియోజకవర్గ కేంద్రమైన పామర్రులో నిర్వహించే ప్రగతి పథం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు.