Share News

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా

ABN , Publish Date - Dec 30 , 2024 | 09:06 PM

Sri Lakshmi Shah: ఎన్టీఆర్ జిల్లాను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై నాణ్యత పెంచేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. విజయవాడలో ఉంటున్న స్థానికుల నుంచి ఐడియాలాజీని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వారిని అడిగి తెలుసుకుంటామని అన్నారు.

AP NEWS: టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలి: కలెక్టర్ లక్ష్మీ షా
Sri Lakshmi Shah

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యంతో జిల్లాలో ఉన్న అధికారులతో సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన వరదలు ఒక ఛాలెంజింగ్ తీసుకున్నామని.. సీఎం చంద్రబాబు, ఐఏఎస్ అధికారులు అందరు దగ్గరుండి నిర్వీరామంగా పనిచేశారని గుర్తుచేశారు. వరద ప్రాంత ప్రజలు ఇబ్బందులు కలగకుండా సాంకేతికతను వాడుకుంటూ సహాయక చర్యలు కొనసాగాయని తెలిపారు. ఉన్న వనరులతో ప్రజలకు ఏవిధంగా దగ్గర అవ్వాలో ఆవిధంగా పనిచేయటం జరిగిందని అన్నారు. రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామని చెప్పారు. రైతులను చైతన్య వంతులుగా చేసేందుకు ఉన్న స్కీమ్స్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.


ఇండిస్ట్రీస్ సెక్టార్‌లో MSME ద్వారా ఉపాధి అవకాశాలతో పాటు వీటి ద్వారా స్కీమ్స్ అందించటం జరుగుతుందన్నారు. గ్రోత్ పెంపుదల కోసం అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టూరిజం హబ్‌‌గా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలని అన్నారు. దుర్గమ్మ దేవాలయం ఇలా పలు దేవాలయాలతో పాటు హిస్టారికల్ ప్రదేశాలు ఇలా అన్ని విధాలుగా టూరిస్ట్‌లకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. టూరిజం కోసం పబ్లిసిటీ ఇచ్చి ప్రాముఖ్యతను పెంపొందించేలా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. టూరిజం కోసం వచ్చే టూరిస్ట్‌లకి వాటి ప్రాముఖ్యత తెలియచేసేలా గైడ్స్ అందుబాటులో ఉండేలా ప్లాన్స్ చేస్తామని అన్నారు. టూరిస్ట్‌ల కోసం గైడ్స్ సంస్థలను ఒక సొసైటీలా తీసుకొచ్చి వాటి ద్వారా ఫిక్స్‌డ్ ధరలని తీసుకొస్తామని చెప్పారు. పర్యావరణం కాపాడుకునేందుకు ఎన్టీఆర్ జిల్లాను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ సదస్సులపై నాణ్యత పెంచేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. విజయవాడలో ఉంటున్న స్థానికుల నుంచి ఐడియాలాజీని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వారిని అడిగి తెలుసుకుంటామని అన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేసి వాటికీ ప్రత్యామ్నాయంగా ఉండేవాటిపై ఆలోచిస్తామని అన్నారు. ఆపరేషన్ బుడమేరు అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Perni Nani: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు

CP Rajasekhar: వార్షిక నేర సమీక్షను విడుదల చేసిన విజయవాడ సీపీ.. ఏం చెప్పారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 10:07 PM