Minister Kollu Ravindra: పేర్ని నానిపై చర్యలు తప్పవు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
ABN , Publish Date - Dec 29 , 2024 | 02:31 PM
Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు.

కృష్ణాజిల్లా, (మచిలీపట్నం): పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్‌పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేరం మొగవాడు చేసినా.. ఆడవాళ్లు చేసినా నేరం నేరమే అవుతుందని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నానినే అని కొల్లు రవీంద్ర అన్నారు.
చెత్త నుంచి సంపద సృష్టిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
అంతకుముందు.. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ డా. పి కృష్ణయ్య, కలెక్టర్‌తో కలిసి మచిలీపట్నం డంపింగ్ యార్డ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ(ఆదివారం) సందర్శించారు. డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అవసరమైన చర్యలపై పొల్యూషన్ బోర్డ్ చైర్మన్‌తో మంత్రి కొల్లు రవీంద్ర చర్చించారు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మచిలీపట్నం డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నామని అన్నారు. మరో ఏడాది లోపు డంపింగ్ యార్డ్‌ను సుందరమైన పార్కుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నిధులు సమకూరుస్తామని అన్నారు. ఏ రోజు వచ్చిన చెత్తను ఆ రోజే డిస్పోజ్ అయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్
Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం
JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్
Read Latest AP News and Telugu News