B V Raghavulu: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి
ABN , Publish Date - Jul 13 , 2024 | 07:41 PM
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు (B V Raghavulu) డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు సీపీఎం సమావేశాలు నిర్వహించారు.
అమరావతి: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీపీఎం (CPM) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు (B V Raghavulu) డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు సీపీఎం సమావేశాలు నిర్వహించారు. ఈరోజు(శనివారం)తో సమావేశాలు ముగిశాయి. అయితే నాయకులు పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశాల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. ఏ. బేబి, బీవీ. రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ... ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా పాలకులపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి: YS Sharmila: నేను ఆ నినాదంతో క్యాంపెయిన్ చేయలేదా.. వైసీపీకి షర్మిల సవాల్
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపి వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించాలని తీర్మానించారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్లు కేటాయించి పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 హామీలను సత్వరమే అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జీపీఎస్ఐ విడుదల చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్ రద్దుకోసం, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసిన పోరాటాలకు సీపీఎం మద్దతు ఇచ్చింది. అసభ్య వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో నియంత్రించేలా చర్యలు చేపట్టాలని తీర్మానం చేశామని రాఘవులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి
Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్
Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telugu News