Share News

YS Sharmila: నేను ఆ నినాదంతో క్యాంపెయిన్ చేయలేదా.. వైసీపీకి షర్మిల సవాల్

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:39 PM

పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ (YSRCP) నేతల తీరు ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.

YS Sharmila: నేను ఆ నినాదంతో క్యాంపెయిన్ చేయలేదా.. వైసీపీకి షర్మిల సవాల్
YS Sharmila

విజయవాడ: పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ (YSRCP) నేతల తీరు ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. సాక్షి పత్రికలో ‘తల్లికి వందనం’ ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని తాము అడిగిమన్నారు. అయితే బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం వైసీపీ నేతల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

ట్విట్టర్ ద్వారా వైసీపీ నేతల విమర్శలకు వైఎస్ షర్మిలారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలకు కళ్లుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్లే అయితే తాము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలని హితవు పలికారు. ‘తల్లికి వందనం’ జీవో 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింపజేయాలని తాము డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.


ఈ వార్త కూడా చదవండి: B V Raghavulu: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి

కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా..?

‘‘మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది..? YCP నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ నినాదంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెబుతోంది’’ అని షర్మిల తెలిపారు.


నాతో అలా ప్రచారం చేయించారు..

‘‘ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ.15000 చొప్పున, ప్రతి తల్లికి ఇస్తామని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు రూ.15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు? మీరు కూడా ఎందుకు క్యాంయిన్ చేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం పూర్తి చేస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు క్యాంపెయిన్ చేయించారు? మీరు కూడా ఎందుకు క్యాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా’’ అని షర్మిల సవాల్ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్

Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 08:04 PM