Share News

AP Elections: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి నిరసన సెగ..

ABN , Publish Date - Apr 03 , 2024 | 09:26 PM

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోడంతో ప్రజలు వైసీపీ (YCP) నాయకులపై ఎదురుతిరుగుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించు కోకపోవడంతో.. ఎన్నికల వేళ ప్రజలు తమ బాధను బహిరంగంగా తెలియజేస్తున్నారు

AP Elections: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి  నిరసన సెగ..

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోడంతో ప్రజలు వైసీపీ (YCP) నాయకులపై ఎదురుతిరుగుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోకపోవడంతో.. ఎన్నికల వేళ ప్రజలు తమ బాధను బహిరంగంగా తెలియజేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా తమకు ఏదైనా పథకం రాలేదని నోరు విప్పితే వైసీపీ నాయకులు బెదిరించే వాళ్లు. దీంతో చాలా మంది సమస్యలు ఉన్నా బయటకు చెప్పేవాళ్లు కాదు. ప్రస్తుతం ఓట్ల కోసం నాయకులు ప్రజల దగ్గరకు వెళ్తుండటంతో తమ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని నిలదీస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రజలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది.

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య


నిరసన సెగ

గుడివాడ నియోజకవర్గంలోని గుడ్ మాన్ పేటలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కొడాలి నానిని స్థానికులు నిలదీశారు. తమ సమస్యలు పట్టించుకోవడంలేదని నిరసన తెలిపారు. ఐదు నెలలుగ త్రాగునీరు రావడం లేదంటూ నానిను మహిళలు ప్రశ్నించారు. మరోవైపు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామని వైసీపీ నాయకులు, ప్రభుత్వం చెబుతోందని, తమకు ఇళ్లు పట్టాలు రాలేదంటూ ఎమ్మెల్యేను మహిళలు నిలదీసి అడుగుతున్నారు. మహిళలు నిలదీయడంతో గుడివాడ ఆర్డీవోకు కొడాలి నాని ఫోన్ చేసి అడిగారు. ఎన్నికల కోడ్ ఉందని ఆర్డీవో చెప్పగా.. పాత తేదీ వేసి పట్టాలు ఇవ్వచ్చుగా అని ఎమ్మెల్యే నాని అడిగారు. దీంతో తర్వాత మాట్లాడతా అంటూ ఆర్డీవో ఫోన్ పెట్టేశారు. చివరికి సరైన సమాధానం దొరకకపోవడంతో పట్టాలు వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఒకరు అడిగినా ఎన్నికల నుండి పోటీ చేయనని ఇటీవల కొడాలి నాని ప్రకటించారు. తాజాగా మహిళలు తమకు ఇళ్ల పట్టాలు రాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇచ్చిన మాటపై కొడాలి నిలబడతారా లేదా అనేది తేలాల్సి ఉంది.


AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 09:26 PM