Share News

AP Politics: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి సమావేశం.. రేపటి సభపై చర్చ

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:56 PM

Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శనివారం మౌర్యా ఫంక్షన్ హాల్లో సమావేశమైంది. రేపు (ఆదివారం) చిలకలూరిపేటలో జరగనున్న సభ, కలిసి ముందుకు వెళ్ళాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, మూడు పార్టీల జిల్లా స్థాయి నేతలు‌ హాజరయ్యారు.

AP Politics: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి సమావేశం.. రేపటి సభపై చర్చ

గుంటూరు, మార్చి 16: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి (TDP-Janasena-BJP alliance) శనివారం మౌర్యా ఫంక్షన్ హాల్లో సమావేశమైంది. రేపు (ఆదివారం) చిలకలూరిపేటలో జరగనున్న సభ, కలిసి ముందుకు వెళ్ళాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే (BJP National Secretary Vinod Tawde), ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari), ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu), జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar), ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, మూడు పార్టీల జిల్లా స్థాయి నేతలు‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పురందేశ్శరి మాట్లాడుతూ... మూడు రాజకీయ పార్టీల పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. రేపు మోడీ బహిరంగ సభలో పాల్గొంటారని.. ఎన్‌డీఏ విజయానికి మోదీ శంఖారావాన్ని పూరించనున్నారని తెలిపారు. కార్యకర్తలు మధ్య సమన్వయం అవసరమని చెప్పుకొచ్చారు.

AP Bhavan: ఎట్టకేలకు వీడిన ఏపీ భవన్ విభజన పీటముడి


అచ్చెన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంతటీ దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. రేపటి సభను విజయవంతం చేసేందుకు అందరూ సిద్దంగా ఉన్నారన్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్, కాలేజ్‌లు బస్సులు ఇస్తామంటున్నారన్నారు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశే ధ్యేయంగా పని చేయాలని పిలునిచ్చారు. చిన్న చిన్న అసంతృప్తులున్నా సర్దుకొని పోవాలని సూచించారు.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అందరం కలిసి మోడి సభను విజయవంతం చేయాలన్నారు. ప్రజాగళం సభకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని నాదెండ్ల పేర్కొ్న్నారు.

ఇవి కూడా చదవండి..

MP Avinash: నెక్ట్స్ టార్గెట్‌ ఎంపీ అవినాష్.. ఎన్నికల్లోపే అరెస్ట్‌..?

YSRCP Candidates List: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2024 | 02:56 PM