Share News

TDP: ఎంపీ విజయసాయిపై పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:12 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( MP Vijayasai Reddy ) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ( Payyavula Keshav ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP: ఎంపీ విజయసాయిపై  పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం

అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( MP Vijayasai Reddy ) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ( Payyavula Keshav ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్రియను సీఎంఓ పర్యవేక్షిస్తుందని తాము చేసిన ఆరోపణలు నిజమని తేలిందని చెప్పారు. తుది ఓటర్ల జాబితా ప్రకటించక ముందే జాబితాలో 95 శాతం బాగుందని విజయసాయి ఎలా చెబుతారని కేశవ్ ప్రశ్నించారు.

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో తొలగించాల్సిన ఓట్లు 10 లక్షలు ఉన్నాయని తాము ఫిర్యాదు చేసినట్లు కేశవ్ తెలిపారు. తమ ఫిర్యాదులపైనే ఎన్నికల కమిషన్ తుది జాబితా విడుదలకు సమయం పెంచిందని కేశవ్ చెప్పారు. టీడీపీ ఫిర్యాదుల పైనే ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రానికి రెండు సార్లు వచ్చారని తెలిపారు. చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని ఆధారాలతో సహా ఇచ్చినట్లు తెలిపారు. తుది జాబితా ప్రకటించకుండా విజయసాయి 97 శాతం క్లియర్ ఉందని చెప్పడంపై కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల తుది జాబితా విడుదలపై తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పయ్యావుల కేశవ్ కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2024 | 04:37 PM