MLC Ram Gopal Reddy: వెలిగొండ రైతులు సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయం
ABN , Publish Date - Mar 06 , 2024 | 10:37 PM
గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన పనులను తానే చేసినట్లుగా సీఎం జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి(MLC Bhumi Reddy Ram Gopal Reddy) అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు రూ.1450కోట్లు కేటాయించి, 90 శాతం వరకు సొరంగాల నిర్మాణం పూర్తిచేయించారని చెప్పారు.
అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన పనులను తానే చేసినట్లుగా సీఎం జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి(MLC Bhumi Reddy Ram Gopal Reddy) అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు రూ.1450కోట్లు కేటాయించి, 90 శాతం వరకు సొరంగాల నిర్మాణం పూర్తిచేయించారని చెప్పారు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ.950కోట్లు కేటాయించి, మిగిలిన పనులను మొక్కుబడిగా చేయించి మొత్తం ప్రాజెక్ట్ తనవల్లే పూర్తయిందని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మొన్న కుప్పం హంద్రీనీవా కాలువ మాదిరే, నేడు వెలిగొండ ప్రాజెక్ట్‌లో కూడా నీళ్లు లేకుండానే ప్రారంభించడం జగన్ ప్రచారపిచ్చికి నిదర్శనమని ఆరోపించారు.
నీళ్లులేని ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించి రైతులను మోసగించడం అంత తేలిక కాదని జగన్ తెలుసుకోవాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.1500కోట్ల పరిహారం గురించి చెప్పకుండా ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేస్తే రైతులు సంతోషిస్తారా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వ అనుమతి పొందడానికి 5 ఏళ్ల సమయం జగన్‌కు సరిపోలేదా అని నిలదీశారు. జగన్ నిజంగా ప్రాజెక్టులు నిర్మిస్తే..తన హయాంలో ఎంత సొమ్ము ఖర్చుపెట్టి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారనే పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని రైతాంగం వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి