Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు
ABN , Publish Date - Dec 16 , 2024 | 02:18 PM
తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
అమరావతి: విజన్ గురించి ప్రిజనరీకి ఏం తెలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దోచుకోవడం దాచుకోవడంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డిని మించినోళ్లు లేరని విమర్శించారు. విజన్ 2020ని ఎగతాళి చేసినోళ్లే నేడు ఫలితాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల గురించి మాట్లాడే జగన్ సైబరాబాద్ చూసి తెలుసుకోవాలని అన్నారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. తండ్రి పాలనను వాడుకుని లక్ష కోట్లు దిగమింగిన ఘనత జగన్ రెడ్డిది అని మండిపడ్డారు. తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
విత్తనాలు రాయితీపై అందించాలి: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి: ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35శాతం రాయితీపై గోదాములు ఇవ్వాలని అన్నారు. అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రాయితీపై రైతులకు పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలు అందించి, భూసారం పెంపు.. నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అవగాహన కల్పించి వంద శాతం సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం
TTD: తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..
Read Latest AP News and Telugu News