Share News

ABV: చంద్రబాబు నివాసానికి మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:24 AM

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు, పలువురు ఉన్నతాధికారులు వస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు మాజీ డీ.జీ ఏ.బి వెంకటేశ్వరరావు వచ్చారు.

ABV: చంద్రబాబు నివాసానికి మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు
AB Venkateswara Rao

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు (TDP National President ) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నివాసం వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు (TDP Leaders), పలువురు ఉన్నతాధికారులు (Officials) వస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు మాజీ డీ.జీ ఏ.బీ వెంకటేశ్వరరావు (AB Venteswararao) వచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలవగానే చంద్రబాబు నివాసం వద్ద అదనపు భద్రత పెరిగింది. సందర్శకులు, నేతల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాస ప్రాంతం సందడిగా మారింది. కాగా ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


కాగా గురువారం చంద్రబాబు తెలుగు దేశం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలను ఉండవల్లికి రావాలని సూచించారు. అయితే డిల్లీ ప్రయాణంలో ఉన్న వారు మినహా మిగిలిన ఎంపీలు హాజరవుతారు. శుక్రవారం ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు హాజరవుతారు.


రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సునామీల దూసుకెళ్లింది. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. మిగిలిన స్థానాలన్నింటినీ కూటమి తన ఖాతాలో వేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద భద్రతను అధికారులు మరింత పెంచారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా కావడంతో నేషనల్ మీడియా సైతం చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇక రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.


చంద్రబాబును కలిసిన వారిలో బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు. అలాగే చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు కేశినేని చిన్ని, బోండా ఉమా, డోలా బాలవీరాంజనేయ స్వామి, ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మనంద రెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడె ప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు వచ్చారు. అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ తదితరులు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రంగంలోకి దిగిన ఏపీ గవర్నర్..!

వలసల జోరు... కారు పార్టీ ఖాళీ..!

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 06 , 2024 | 12:29 PM