హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

ABN, Publish Date - Jun 06 , 2024 | 08:03 AM

హైదరాబాద్‌: నగరంలో దంచికొట్టిన వాన రహదారులను ముంచేసింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీవర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట, వెస్ట్‌శ్రీనగర్‌ కాలనీ, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో వరద ఉధృతికి ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలో కార్లు, బైక్‌లు సగానికిపైగా వరదనీటిలో మునిగాయి. వాటిని నీటినుంచి బయటకు తెచ్చేందుకు వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అమీర్‌పేట, యూసుఫ్‌గూడ ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మధురానగర్‌, శ్రీకృష్ణానగర్‌ ఏ బ్లాక్‌, వెస్ట్‌శ్రీనివాసనగర్‌ కాలనీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు.. 1/6

హైదరాబాద్‌లో బుధవారం కురిసిన వర్షానికి అమీర్‌పేట, మైత్రీవనం చౌరస్తాలో వరదనీటి కష్టాలు.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు.. 2/6

బుధవారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షానికి చెరువును తలపిస్తున్న ప్రధాన రహదారి..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు.. 3/6

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి అమీర్‌పేట చౌరస్తాలో ఆగమాగం అయింది. వరదలో ద్విచక్రవాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం.

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు.. 4/6

లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నిలిచిపోయిన ట్రాఫిక్.. వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు.. 5/6

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వరద నీటిలో ఇబ్బంది పడుతున్న ఓ వాహనదారుడు..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు.. 6/6

అమీర్‌పేట చౌరస్తాలో రోడ్డు జలమయం కావడంతో సగం నీట మునిగిన కార్లు, బైక్‌లు, ఆటోలు.. కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు..

Updated at - Jun 06 , 2024 | 08:03 AM