Share News

AP Elections: చింతలపూడి నియోజకవర్గ రత్నం.. ఎలిజా

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:39 PM

చింతలపూడి నియోజకవర్గ రత్నం ఎలిజా అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసలు కురించారు. ఆ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరి మీ ముందుకు వచ్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇక్కడకు వచ్చారని, చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఆ మాటే మరచిపోయాడని విమర్శలు గప్పించారు.

AP  Elections: చింతలపూడి నియోజకవర్గ రత్నం.. ఎలిజా
YS Sharmila

ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గ రత్నం ఎలిజా అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశంసలు కురించారు. ఆ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరి మీ ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇక్కడకు వచ్చారని, చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఆ మాటే మరచిపోయాడని విమర్శలు గప్పించారు. చింతలపూడి నియోజక వర్గంలో జరిగిన భారీ బహిరంగ సభ వైఎస్ షర్మిల మాట్లాడారు.


చింతలపూడి పథకం నిర్మించడం వైఎస్ఆర్ కల అని షర్మిల గుర్తుచేశారు. నియోజక వర్గంలో 2 లక్షల ఎకరాలు, పక్క నియోజక వర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని వివరించారు. సీఎం జగన్‌పై షర్మిల విమర్శలు గుప్పించారు. ’పామాయిల్ పంటకు గిట్టుబాటు ధర ఏదీ. నష్టపరిహారం ఇస్తా అని ఇవ్వలేదు. 2019 లో పంట తక్కువ ధరకే విక్రయిస్తే పరిహారం ఇస్తామని మోసం చేశారు. తనకు మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు. సీఎం అయ్యాక ఒక్క రోజుప్రజల మధ్యకు వచ్చింది లేదు.మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అని’ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


‘పదేళ్లలో పది కొత్త పరిశ్రమలు రాలే. ఈ కాలంలో మిగిలింది చేతిలో చిప్ప. అమరావతి అని బ్రమరావతి చేశారు. మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. చివరికి ఏ రాజధాని కూడా లేకుండా చేశారు. చింతలపూడి నుంచి ఎలిజాను గెలిపించండి. ఈ సారి అభివృద్ధి కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రజల పార్టీ. ప్రజల కోసం పని చేసే పార్టీ అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.


Read Latest
Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 09:44 PM