Share News

AP Elections: ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం

ABN , Publish Date - May 10 , 2024 | 10:25 AM

Andhrapradesh: జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముస్లిం పెద్దలు ఘనంగా సన్మినించారు.

AP Elections: ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం
TDP Chief Chandrababu Naidu

విశాఖపట్నం, మే 10: జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు (Muslim religious leaders) ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముస్లిం పెద్దలు ఘనంగా సన్మినించారు.

Lok Sabha polls 2024: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..


అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. జగన్ (CM Jagan) హయాంలో ముస్లింలకు న్యాయం జరగలేదన్నారు. ‘‘నా మైనార్టీ సోదరులు అంటారు... కానీ చేతల్లో ఉండదు’’ అని విమర్శించారు. టీడీపీడ హయాంలో ముస్లిం కోసం ప్రవేశపెట్టిన పథకాలకు జగన్ సర్కార్ తూట్లు పొడిచిందన్నారు. సంక్షేమ పథకాల అమలులోను వివక్షత చూపించారన్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరిందని వైసీపీ విమర్శిస్తోందని.. కేంద్రం ప్రవేశ పెట్టిన కీలక బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు.

AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!


ముస్లింల పాలిట చంద్రబాబు డైమండ్, బంగారం అంటూ కొనియాడారు. మ్యానిఫెస్టోలో ముస్లింల కోసం బాబు ప్రత్యేక అంశాలు పొందుపరిచారన్నారు. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని.. అప్పుడే ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుందని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. ఈ సమావేశానికి కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు పల్లా శ్రీనివాస్ రావు, వంశీ కృష్ణ శ్రీనివాస్, వెలగపూడి, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 11:20 AM