Share News

AP Election 2024: వైసీపీ ప్రభుత్వం ఆ పథకం పేరు కూడా మార్చింది.. జనసేనాని ఫైర్

ABN , Publish Date - Apr 23 , 2024 | 08:40 PM

వైసీపీ (YSRCP) ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యాపథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకమని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అంటేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు.

 AP Election 2024: వైసీపీ ప్రభుత్వం ఆ పథకం పేరు కూడా మార్చింది.. జనసేనాని ఫైర్

కాకినాడ: వైసీపీ (YSRCP) ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యాపథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకమని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అంటేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు. మంగళవారం నాడు టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తాను అంటేద్కర్ భావజాలం అర్థ చేసుకున్న వాడినని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని కోరారు.


Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!

రాజధాని భూ సమీకరణప్పు డు దళితుల అసైన్డ్ భూములకు తక్కువ ధర చెల్లిస్తున్నారని చెబితే అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. తాను ఎస్సీల గౌరవాన్ని ఏ రోజు కూడా తగ్గించే ప్రయత్నం చేయనని స్పష్టం చేశారు. తన జీవితంలో చాలామంది ఎస్సీ స్నేహితులు, టీచర్లు ఉన్నారని తెలిపారు. వారి వల్లనే తాను ఇంత బలంగా మాట్లాడగలు గుతున్నా నని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక ప్రతీ ఒక్కరూ వచ్చి సమస్యలు చెప్పుకునేలా, తనను కలిసేలా ఏర్పాట్లు చేస్తానని మాటిచ్చారు. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.


AP Election 2024: ఈ సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది... జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో పవన్ భేటీ..

పిఠాపురం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకొనే పరిస్థితి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో వ్యాపారులకు రక్షణ కరువైందని మండిపడ్డారు. అయినా వ్యాపారులు భయ పడకూడదని.. దైర్యంగా ఉండాలని చెప్పారు. నెల్లూరులో తన స్నేహితుడు రమేష్ పుస్తకాలు ఇవ్వడం వల్ల తాను చదువుకున్నానని అతను ఒక వైశ్యుడు అని తెలిపారు. ఆర్యవైశ్యులకు రక్షణ కల్పించేందుకు, దాడులు లేకుండా చేసేందుకు అట్రాసిటీ తరహా చట్టాలు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు.


ఇవి కూడా చదవండి

Pawan Kalyan: నామినేషన్ అనంతరం జనసేనాని కీలక వ్యాఖ్యలు

AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 08:45 PM