Share News

AP Elections 2024: హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి దక్కని ఊరట

ABN , Publish Date - May 07 , 2024 | 05:30 PM

ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్‌పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.

AP Elections 2024:  హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి దక్కని ఊరట
Jagan Govt

అమరావతి: ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్‌పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది. ప్రభుత్వ పథకాలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అని, వాటికి నిధులు నిలిపివేయడం సరి కాదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. నిధులు విడుదల నిలిపివేయడం వల్ల మే చివరికి ఆ నిధులు మురిగిపోతాయని న్యాయవాది చెప్పారు.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!


మే చివర అంటే చాలా రోజులు ఉంది కదా అని హైకోర్టు (AP High Court) వ్యాఖ్యానించింది. తాము పథకాలకు నిధుల విడుదల నిలిపివేయమని చెప్పలేదని, ఎన్నికలు అయిపోయే వరకు వాయిదా వేయమన్నామని ఎన్నికల కమిషన్ న్యాయవాది తెలిపారు. పథకాల నిధులను అత్యవసరంగా విడుదల చేయాల్సిన అవసరం ఏముందని వివరణ అడిగామని ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, మరోసారి విజ్ఞప్తిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో పరిశీలించి అప్పుడు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈకేసు విచారణను హైకోర్టు గురువారం ఉదయానికి వాయిదా వేసింది.

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 05:37 PM