Share News

AP Politics: మంత్రి కాకాణికి ఓటమి భయం.. వైసీపీ నేతలు ఎంతపని చేశారంటే..!

ABN , Publish Date - Apr 21 , 2024 | 08:23 AM

ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.

AP Politics: మంత్రి కాకాణికి ఓటమి భయం.. వైసీపీ నేతలు ఎంతపని చేశారంటే..!
AP Elections 2024

నెల్లూరు, ఏప్రిల్ 21: ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది. ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాకాణి అనుచరులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యం డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సామాన్య ప్రజలు సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...


ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రెండు రోజులుగా పలు చోట్ల దాడులు, తనిఖీలు చేపట్టారు సెబ్ అధికారుల బృందాలు. పంటపాళెం సమీపంలో వైసీపీ నేత మారు సుధాకర్ రెడ్డి కారులో ఆరు బస్తాల్లో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. దాంతో కారు వదిలి పరారయ్యాడు డ్రైవర్. రొయ్యల గుంటల వద్ద కాపాలదారుల ఆవాసాల్లోనూ మద్యం నిల్వలు గుర్తించారు అధికారులు.

ఇవి కూడా చదవండి: కూతురి కోసం ఎంపీ స్థానాల తాకట్టు!


4200 మద్యం సీసాలు, మూడు కార్లని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. అయితే, దొరికిన నిందితులంతా మంత్రి కాకాణి అనుచరులుగా గుర్తించారు. ఎన్నికల్లో‌ భారీగా మద్యం పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకోవాలని వైసీపీ నేతలు ఇలా కుట్రకు తెర లేపారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రలోభాలకు లొంగొద్దని.. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి నేతలను ఆశీర్వదించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2024 | 08:23 AM