Share News

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

ABN , Publish Date - May 05 , 2024 | 01:41 PM

ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!
Chandrababu and Lokesh

ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే తాజాగా చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేయడమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సీఐడీ అధికారులు.. చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో.. తక్షణమే సీఐడీ అధికారులు చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎ1గా చంద్రబాబు, ఎ2గా నారా లోకేష్‌ పేర్లను సీఐడీ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఐవిఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..


కూటమి నేతల అనుమానం..!

మరోవైపు.. ఈ కేసుపై కూటమి నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ కేసులు పెట్టి టీడీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు వైసీపీ తెరలేపిందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇదే.. వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదులు చేస్తే మాత్రం కనీసం చర్యలు కూడా తీసుకోవట్లేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం ఆలస్యం వెంటనే ఎన్నికల అధికారులు స్పందించడం, సీఐడీ కేసు నమోదు చేయడంపై టీడీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


గత ఐదేళ్లుగా..

ప్రతిపక్షమైన టీడీపీని దెబ్బతీసేందుకు ఐదేళ్ల పాటు జగన్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి టీడీపీ నేతలు మొదలుకుని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వరకూ అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులు పెట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఎన్నికల వేళ మరిన్ని కుట్రలతో బాబును ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది కచ్చితంగా కుట్ర అంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉండటంతో పాటు వైసీపీ వైఫల్యాలపై చర్చ జరగకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని కూటమి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌లో ఉన్న వాస్తవాలను ప్రజలకు చెబితే తప్పు ఎలా అవుతుంది..? అంతకుమించి తప్పుడు ప్రచారం ఎలా అవుతుంది..? అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ చట్టంపై ప్రజలు ఆందోళనతో ఉన్నారని, ఈ చట్టంతో కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడం అసత్య ప్రచారం ఏ మాత్రం కాదని చెబుతున్నారు. ఈ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.


Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 05 , 2024 | 01:41 PM