Share News

YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!

ABN , Publish Date - May 06 , 2024 | 11:24 AM

తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తాను జగన్‌ను పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని స్పష్టం చేశారు.

YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!
YS Sharmila

కడప: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాను బరిలో ఉన్న కడప లోక్ సభ స్థానంలో ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తాను జగన్‌ను పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని స్పష్టం చేశారు.


జగన్ వేసే బిస్కెట్లకు ఆశ పడి..

‘రూ. వెయ్యి కోట్ల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడే వారే. ఇలా మాట్లాడితే మీకు ఎంత అందుతుందో చెప్పండి ? రూ.వెయ్యి కోట్లు కాదు రూ. 10 వేల కోట్ల వర్క్ అడిగానని కూడా చెబుతారు. జగన్‌ను ఒక్క పైసా సహాయం అడగలేదు. అలా అని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. జగన్ పక్కన ఉండే వాళ్లు ఊసరవెల్లులు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారు. తన తల్లి విజయమ్మపై నిందలు వేశారు. ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ అన్నారు. అంతా నమ్మారు, ఆ సంస్థపై దాడులు చేశారు. కేసులో ఇరుక్కున్నారు. జగన్ సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వారికి ఎంపి ఇచ్చారు అని’ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


అవినాష్‌ను అనిల్ కలువలే..?

‘వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సీబీఐ విచారణ అడిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విచారణ వద్దన్నారు. అప్పుడొ మాట, ఇప్పుడొ మాట మాట్లాడారు. వైఎస్ఆర్ పేరుని సీబీఐ చార్జ్ షీట్‌లో పెట్టించారు. పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సొంత తండ్రి పేరు సీబీఐ ఛార్జ్ షీట్‌లో చేర్పించారు. నా భర్త అనిల్ పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి మాదిరిగా మద్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం మాకు చేతకాదు. అనిల్‌ను కలవలేదు. ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఆయనకు లేదు అని’ షర్మిల స్పష్టం చేశారు.



Read Latest
Andhra pradesh News or Telugu News

Updated Date - May 06 , 2024 | 11:24 AM