Share News

AP Elections: ఏపీలో ఊపందుకున్న బెట్టింగ్స్.. ఎక్కువ పందేలు ఎవరి గురించంటే?

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:02 PM

Andhrparadesh: ఏపీలో ఎన్నికలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. పోలింగ్‌కు 20 రోజులు మాత్రమే ఉండడంతో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. నేషనల్ మీడియా ద్వారా వచ్చిన 11 సర్వేల తరువాత పందేల్లో దూకుడు పెరిగింది.

AP Elections: ఏపీలో ఊపందుకున్న బెట్టింగ్స్.. ఎక్కువ పందేలు ఎవరి గురించంటే?
Bettings on AP Elections

అమరావతి, ఏప్రిల్ 20: దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఒకెత్తైతే.. ఏపీలో జరిగే ఎన్నికలు (AP Elections) వేరే లెవల్. అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే... ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిది అనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రులు మళ్లీ జగన్‌కే (CM Jagan) పట్టం కడతారా? లేక ఈసారి చంద్రబాబుకు (TDP Chief Chandrababu) అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మళ్లీ జగన్‌కే సీఎం కుర్చీ అనేది కొందరి మాట అయితే.. కచ్చితంగా చంద్రబాబే అధికారంలో వస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై ఏపీలో ఎన్నికలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. పోలింగ్‌కు 20 రోజులు మాత్రమే ఉండడంతో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు.

AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!


కూటమి విజయంపైనే...

ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. నేషనల్ మీడియా ద్వారా వచ్చిన 11 సర్వేల తరువాత పందేల్లో దూకుడు పెరిగింది. కూటమి విజయంపై జోరుగా పందేలు వేస్తున్నారు పందెం రాయుళ్లు. కూటమికి 120 నుంచి 130 వస్తాయంటూ పందేలు వేస్తున్న పరిస్థితి. 1:10 రేషియోలో బెట్టింగ్ నడుస్తోంది. గోదావరి జిల్లాలు క్లీన్ స్వీప్ అంటూ కూటమి తరుపున ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం తరువాత మారిన పరిస్థితుల ఆధారంగా బెట్టింగులు పెరిగాయి. కూటమి గెలుపుపైనే ఉత్సాహంగా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నట్లు తెలియవచ్చింది. కాన్ఫిడెంట్‌గా కూటమి గెలుపుపై పందాలు కాస్తుండటంతో వైసీపీ మద్దతు దారులు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం.


మాజీ మంత్రి వ్యాఖ్యలతో..

కుప్పం, పిఠాపురం, మంగళగిరిలో మెజారిటీలు, కడప ఎంపీ సీటు ఎవరు గెలుస్తారు అనే అంశంపైనా ప్రత్యేకంగా బెట్టింగ్ జరుగుతోంది. వైసీపీపై పందెం పెట్టడంలో మద్దతుదారులు ఆచి తూచి అడుగేస్తున్నారు. ఓటమి తప్పదని తెలిస్తే డబ్బులు ఎందుకు పంచుతాం అంటూ అంతర్గత సంభాషణల్లో ఓ మాజీ మంత్రి అన్నట్టు టాక్.. దీంతో మాజీ మంత్రి వ్యాఖ్యలతో గెలుపుపై బెట్టింగ్‌కు వెళ్లి మరీ హైదరాబాద్‌లోని వైసీపీ మద్దతుదారులు రద్దు చేసుకున్నాట్లు సమాచారం.

Hyderabad: ఎండ @ 43 డిగ్రీలు


జగన్ మెజారిటీ పైనా...

అలాగే పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశంపైనా సీమ జిల్లాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మాచర్ల, పుంగనూరు సీట్లపై రెండు జిల్లాల్లో విస్తృతంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఒక్క క్యాబినెట్ మొత్తం ఓడిపోతుందని.. 20 మంది ఓడిపోతారంటూ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. వైసీపీకి 23 లోపే అసెంబ్లీ సీట్లు అంటూ కూడా పందేలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. చూద్దాం మరి.. బెట్టింగ్ రాయుళ్లు అనుకున్న విధంగా కూటమిదే గెలుపా? కాదా?... పులివెందులలో జగన్ మెజారిటీ ఎంతో?.. అన్నది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచన

AP Elections: జగన్ గాలి తీసేసిన యువత.. ఆ సీన్ చూసి వైసీపీ మైండ్ బ్లాంక్

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 01:10 PM