Share News

AP Politics: ఒకే రోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు..

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:33 PM

Andhra Pradesh News: ఓటమి భయమా? మరోంటో తెలియదు గానీ.. విపక్ష నేతలపై వైసీపీ(YCP) సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

AP Politics: ఒకే రోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు..
Nara Lokesh Convoy Checking

Andhra Pradesh News: ఓటమి భయమా? మరోంటో తెలియదు గానీ.. విపక్ష నేతలపై వైసీపీ(YCP) సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం ఒక్క రోజే రెండుసార్లు లోకేష్ కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు పోలీసులు. అది కూడా టీడీపీ(TDP) నేతల కార్లను మాత్రమే తనిఖీలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ని పోలీసులు ఆపారు. ఆయన కాన్వాయ్‌లోని ప్రతి కారును చెక్ చేశారు. ఇవాళ ఒక్కరోజే రెండుసార్లు చెక్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని లోకేష్‌కి చెప్పారు పోలీసులు. ఈ తనిఖీలకు పోలీసులు సైతం సహకరించారు. కాగా, వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు లోకేష్. ఒక్క టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేశారు పోలీసులు.

Also Read: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..

మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి నారా లోకేష్ వెళ్తున్నారు. ఆ సమయంలో కాన్వాయ్ ఆపిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాన్వాయ్‌లో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధాంచారు పోలీసులు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు నిర్ధారించుకున్నారు. కాగా, కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు నాలుగుసార్లు లోకేష్‌ కాన్వాయ్‌ని ఆపి తనిఖీలు నిర్వహించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 06:33 PM