Share News

ABN Big Debate With CBN: జగన్ నైజం ఇదే.. కాళ్లు పట్టుకుంటాడు: చంద్రబాబు

ABN , Publish Date - May 08 , 2024 | 08:51 PM

సీఎం జగన్‌ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.

ABN Big Debate With CBN: జగన్ నైజం ఇదే..  కాళ్లు పట్టుకుంటాడు: చంద్రబాబు
ABN Big Debate With CBN

ABN Big Debate With CBN: సీఎం జగన్‌ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు. 45ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా..చాలా పార్టీలను, చాలామంది సీఎంలను చూశానని తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. అబద్ధాలు చెబుతూ జనాన్ని నమ్మించారని విమర్శించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ పార్టీ కూడా మీడియా సంస్థలు పెట్టలేదని.. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడానికే జగన్ పేపర్‌ పెట్టారని ధ్వజమెత్తారు.ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేశారని అన్నారు. జీవితంలో కొందరు ఊహకు అందరని చెప్పారు.


ఇలాంటి వ్యక్తి పుడతాడని ఎవరూ ఊహించలేదని.. జగన్‌ను తండ్రి ఎందుకు బెంగళూరుకు పంపించాడు? అని ప్రశ్నించారు. జగన్‌ను తాము తక్కువ అంచనా వేశానని చెప్పుకొచ్చారు. జగన్‌ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమేనని చంద్రబాబు పేర్కొన్నారు. జనం కోసం మూడు పార్టీలు కలిశాయని చెప్పారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి ఉందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిందని ధ్వజమెత్తారు. దాదాగిరి పెరిగింది.. రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి, పరిశ్రమలను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. 2014లోనూ ఎన్డీఏతో కలిసిన సమయంలో తానెప్పుడూ పదవులు అడగలేదని అన్నారు. జగన్‌ కాళ్లు మొక్కి కేసులు మాఫీ చేయించుకుంటాడని చెప్పారు. జగన్‌ మాటల్లో చాలా వ్యత్యాసం వచ్చిందన్నారు. గతంలో తనను ఎవరూ టచ్‌ చేయలేరన్నారని.. ఇప్పుడేమో తనను ఓడిస్తారంటున్నాడని చెప్పుకొచ్చారు. జగన్‌ మళ్లీ వస్తాడని తనకు నమ్మకం లేదని చంద్రబాబు అన్నారు.

Updated Date - May 08 , 2024 | 09:02 PM