Share News

AP Elections 2024: చంద్రబాబు సీఎం కావాలని.. నాలుక కోసుకున్న వీరాభిమాని

ABN , Publish Date - May 12 , 2024 | 05:44 PM

ఎలాగైతే సినిమా హీరోలకు వీరాభిమానులు ఉంటారో.. అలాగే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు రూపాయి అందకపోయినా సరే..

AP Elections 2024: చంద్రబాబు సీఎం కావాలని.. నాలుక కోసుకున్న వీరాభిమాని

ఎలాగైతే సినిమా హీరోలకు వీరాభిమానులు ఉంటారో.. అలాగే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు రూపాయి అందకపోయినా సరే.. నేతల తరఫున విస్తృత ప్రచారం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అభిమాని చేసిన ఓ పని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలింగ్‌కి మరికొన్ని గంటల సమయమే ఉందనగా.. అతను ఓ షాకింగ్ ఘటనకు పాల్పడి, రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టించాడు.

ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ ‘న్యూక్లియర్’ వార్నింగ్

ఇంతకీ.. ఆ అభిమాని ఏం చేశాడో తెలుసా? ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో (AP Elections 2024) టీడీపీ కూటమి (TDP Alliance) అఖండ విజయం సాధించి, చంద్రబాబు మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తన నాలుకని కోసుకున్నాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటన జరిగింది ఏపీలో కాదు, తెలంగాణలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో! ఇది చూసి షాక్‌కి గురైన స్థానికులు, వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


ప్రధాని మోదీకి సీఎం కౌంటర్.. ఆ హామీల సంగతేంటి?

కాగా.. ఆ వ్యక్తి పేరు మహేశ్ అని తెలిసింది. పశ్చిమగోదావరి జిల్లా గుటల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతంలో (2004-2009) వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావాలని, అలాగే 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని తాను శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం వద్ద నాలుక కోసుకున్నానని మహేశ్ ఓ లెటర్ రాశాడు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు ఏపీకి సీఎం అవ్వాలని, అలాగే పిఠాపురంలో పోటీచేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని తాను నాలుక కోసుకొని మొక్కు తీర్చుకున్నానని అందులో తెలిపాడు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో మహేష్ చికిత్స పొందుతున్నాడు.

వైసీపీ దుష్ప్రచారం.. పథకాల్లేవంటూ చంద్రబాబు ‘ఫేక్ ఆడియో’ వైరల్

ఇదిలావుండగా.. ఈసారి అధికార వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. కూటమికే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. తనకు ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ని జగన్ సరిగ్గా వినియోగించుకోకపోవడం, రాజధాని విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేసి పథకాలతోనే కాలక్షేపం చేయడం, గత ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలను తుంగలో తొక్కేయడంతో.. జగన్ సర్కార్‌పై వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఈసారి టీడీపీ కూటమిదే గెలుపంటూ సర్వేలు కూడా తేల్చి చెప్తున్నాయి. దీంతో.. ఫలితాలు ఎలా వస్తాయని జూన్ 4వ తేదీ కోసం అందరూ వేచి చూస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 05:44 PM