Share News

Kandula Durgesh: జనసేన అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తా

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:43 PM

రాజమండ్రి రూరల్ ( Rajahmundry Rural ) నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ( Kandula Durgesh ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పార్టీ తరపున కష్టపడి పనిచేస్తున్నానని.. పార్టీలకతీతంగా అందరి సహకారం తనకు ఉందని కందుల దుర్గేష్ చెప్పారు.

Kandula Durgesh: జనసేన అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తా

రాజమండ్రి: రాజమండ్రి రూరల్ ( Rajahmundry Rural ) నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ( Kandula Durgesh ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పార్టీ తరపున కష్టపడి పనిచేస్తున్నానని.. పార్టీలకతీతంగా అందరి సహకారం తనకు ఉందని చెప్పారు. జనసేనతో పొత్తు కుదరకముందు టీడీపీ ( TDP ) సిట్టింగ్ ఎమెల్యేలకు టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారన్నారు. జనసేనతో పొత్తుల తర్వాత పరిస్థితులు మారాయన్నారు. జనసేన నుంచి తనకు టికెట్ రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల నాయకత్వంలో ఏపీలో వైసీపీని ఓడిస్తామని కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 03:43 PM