Harsha Kumar: రాజ్ సంపత్‌ని హత్య చేసిన వారిని శిక్షించాలి
ABN , Publish Date - Aug 05 , 2024 | 04:42 PM
కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది రాజ్ సంపత్‌ని దారుణంగా హత్యచేశారని, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ (Harsha Kumar) డిమాండ్ చేశారు.
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది రాజ్ సంపత్‌ని దారుణంగా హత్యచేశారని, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ (Harsha Kumar) డిమాండ్ చేశారు. పోలీసులు సంపత్‌పై కేసు ఉందని, రావాల్సిందిగా పిలిచారని చెప్పారు. ఈ కేసుతో సంబంధం లేకపోయినా కేసు పెట్టారని అన్నారు. సంపత్‌కు వాళ్ల పెదనాన్నతో విభేదాల కారణంగా మే 29 వ తేదీన బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లి చంపారని ఆరోపించారు. హిందూపూర్‌లో కేసీ కృష్ణా రెడ్డి న్యాయవాది, రియల్ ఎస్టేట్, వ్యాపారస్తుడు ఈ హత్యకు కారణమని ఆరోపించారు.
ALSO Read: CM Chandrababu: గ్యారెంటీలు ఎలా ఇవ్వగలం.. పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు
3నెలలు అవుతున్నా అరెస్ట్ చేయలేదు..?
హత్య జరిగి మూడు నెలలు అయిందని, నిందితులకు బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. హత్యకు కారణమైన వారు నేటికీ ఎందుకు అరెస్ట్ కాలేదని నిలదీశారు. కోడి కత్తి శీను అంశంలో ఎవరికి సాధ్యం కాని విషయంలో బెయిల్‌పై న్యాయవాది రాజ్ సంపత్ బయటకు తీసుకు వచ్చారని గుర్తుచేశారు. హిందూపురంలో హత్యకు కారణమైన వారు ఎవరో పోలీసులకు, హిందూపూర్ వాసులకు తెలుసునని చెప్పారు. ఈ విషయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లానని, అయినా నెల గడిచినా చర్యలు శూన్యమని హర్షకుమార్ అన్నారు.
చర్యలు శూన్యం
సంపత్ హత్య కేసులో ఏ 1 , ఏ 2, ఏ3 లుగా పోలీసులను, ఏ 4 గా కేసీ కృష్ణారెడ్డి పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక న్యాయవాదిని చంపేస్తే , బెయిల్ ఎలా ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారని అన్నారు. మూడు నెలలైనా టీడీపీ ప్రభుత్వం హంతకులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం చేసినట్టే టీడీపీ కూడా చేస్తుందని విమర్శించారు. ఎఫ్ఐఆర్ వేసి 40 రోజులవుతున్నా చర్యలు శూన్యమని, దళితులను హత్య చేస్తే ఎవరూ పట్టించుకోరా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తిని ఒకటే కోరుతున్నామని.. న్యాయవాది సంపత్‌కు న్యాయం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు.
సంపత్‌ను హత్య చేసినా స్పందించరా: న్యాయవాది అబ్దుల్ సలీం
చిన్న దొంగతనం చేసిన వారిని అరెస్ట్ చేసే పోలీసులు జాతీయ నాయకులు సంపత్‌ను హత్య చేసినా ఎందుకు స్పందించడం లేదని న్యాయవాది అబ్దుల్ సలీం ప్రశ్నించారు. ఈ కేసులో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ఈ కేసులో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని రిట్ పిటిషన్ వేస్తున్నామని న్యాయవాది అబ్దుల్ సలీం అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP News: ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్... మాకు ఇవ్వాల్సిందే..
AP HighCourt: పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
Read Latest AP News And Telugu News