Share News

CM Chandrababu: గ్యారెంటీలు ఎలా ఇవ్వగలం.. పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:45 PM

Andhrapradesh: పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ... గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని తెలిపారు. పోర్టులు నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ప్రశ్నించారు. కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేమన్నారు.

CM Chandrababu: గ్యారెంటీలు ఎలా ఇవ్వగలం.. పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 5: పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ... గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని తెలిపారు. పోర్టులు నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ప్రశ్నించారు. కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేమన్నారు. కాంట్రాక్టర్లను తప్పుచేసి పనులు ఆపేయడం ఈ ప్రభుత్వ విధానం కాదని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో ఈవీ వెహికల్స్‌ను ప్రొత్సహించాలని సూచించారు. ఈవీ వాహనాలకు ఛార్జింగ్ కోసం పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై ప్రణాళికలను సీఎంకు సబ్మిట్ చేస్తానని విజయానంద్ చెప్పగా... తనకేం సబ్మిట్ చేయనక్కర్లేదని... ఇంప్లిమెంట్ చేయండని సీఎం ఆదేశించారు.

Supreme Court: 15 నెలల తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్


ఉన్నత విద్యపై..

అలాగే పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. ఆ శాఖ కార్యదర్శులు కోనశశిధర్, సౌరభ్ గౌర్ ఉన్నత విద్యపై సదస్సులో వివరించారు. ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం సూచించారు. గతంలో నాక్ అక్రెడిషన్‌లో ఏపీ యూనివర్సిటీలు టాప్ 10లో ఉండేవని.. ఇప్పుడు నాక్ అక్రిడేషనులో ఒక్కటి కూడా లేకపోవటం శోచనీయమన్నీరు. పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలన్నిరు. దానిపై కూడా ఎవరికీ ఫోకస్ లేకుండా పోయిందన్నిరు. మన విద్యార్ధులు గ్లోబల్ స్థాయిలో నైపుణ్యాల్ని సంపాదించుకునేలా శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా ఉండే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానాన్ని రూపోందించాలని.. దీనిపై ఓ వర్క్ షాప్ చేయాలన్నారు. ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


విద్యాశాఖపై ప్రెజెంటేషన్.. సీఎం చమత్కారం

కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై ఆ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోస్ట్ లంచ్ సమావేశం కాబట్టి వీలైనంత త్వరగా ముగిస్తానని కోనశశిధర్ అనగా.. ఎవ్వరికీ నిద్ర రాకుండా ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం చమత్కరించారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని కోన శశిధర్ వివరించారు. ఏ స్కూల్ అయినా సరే.. పిల్లలు స్కూళ్లకు వచ్చేలా చూడాలని చంద్రబాబు తెలిపారు. పిల్లలు ఎవ్వరూ డ్రాపవుట్ కావడానికి వీలులేదన్నారు. డ్రాపవుట్లు ఉండకుండా కసరత్తు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రకాల పాఠశాలలు సీబీఎస్సీ పరీక్షలకు పూర్తి స్ధాయిలో సన్నద్దమయ్యేలా కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

AP News: ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్... మాకు ఇవ్వాల్సిందే..

AP HighCourt: పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 04:45 PM