AP Elections: జనసేనానుల రాకతో ఎటు చూసినా జనం..!
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:11 AM
జనసేనా నుల రాకతో ఎటు చూసినా జనం.. జనం.. నిడదవోలు ప్రజాగళం సభ దద్దరిల్లింది. వారాహి విజయభేరిగా ఈ సభ మార్మోగింది. తొలిసారిగా ఒకే వేదిక మీద ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి గర్జించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో భలే ఊపు వచ్చింది.
నిడదవోలు సభకు పోటెత్తిన జనం
20 వేల మందిపైగా వచ్చారని అంచనా
దద్దరిల్లిన సభా ప్రాంగణం
రాజమహేంద్రవరం/నిడదవోలు/ఉండ్రాజవరం,ఏప్రిల్ 10 : జనసేనానుల రాకతో ఎటు చూసినా జనం.. జనం.. నిడదవోలు ప్రజాగళం సభ దద్దరిల్లింది. వారాహి విజయభేరిగా ఈ సభ మార్మోగింది. తొలిసారిగా ఒకే వేదిక మీద ఎన్నికల సభలో టీడీపీ అఽధినేత చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి గర్జించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో భలే ఊపు వచ్చింది. నిడదవోలు పట్టణంలోని గణేష్‌చౌక్ సెంటర్ అంతా జనసంద్రంగా మారింది. సాయం త్రం ఐదు గంటల నుంచే పరిసర గ్రామాల నుంచి ప్రజలు ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చారు.నాయకులు మాట్లాడుతున్నంతసేపు జైచంద్రబాబు, జైపవన్‌కల్యాణ్ అంటూ ప్రజలు ఆ పార్టీ జెండాలతో సందడి చేస్తూనే ఉన్నారు.ఈ జనాన్ని చూసి చంద్రబాబు మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థం అయిపోయింది. జగన్‌ను ఇంటికి పంపడానికి మీరు ఇప్పటికే నిర్ణయం చేశారు.మే 13 ఇక లాంఛనం మాత్రమే అనడం గమనార్హం. ఈ మూడు పార్టీలు ఎందుకు కలిశాయో పవన్‌కల్యాణ్ వివరించి చెప్పడం గమనార్హం. దుర్మార్గుడైన జగన్‌ను ఓడించడం కోసం, యువత ఉపాధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఐక్యమయ్యాయన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సమస్యలను చకచకా పరిష్కరిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి మాట్లాడుతూ ఏన్డీఏ విజయంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు పెద్ద మనస్సుతో ఇక్కడ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేయడానికి సహకరించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు చిన్న కాశీ రేవుకు వెళ్లే వంతెన నిర్మాణంతోపాటు వంద పడకల ఆసుపత్రి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కారం చేస్తాం. గోదావరి జలాలను పట్టణ ప్రజలకు అందేలా చర్యలు చేపడతాం. ఇండోర్ స్టేడియం నిర్మిస్తాం. నిడదవోలు, సమిశ్రగూడెం మధ్యలో ఉన్న పురాతన హేవ్‌లాక్ బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మిస్తాం. కంసాలిపాలెం -మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరిస్తామని పవన్ చెప్పారు. నిడదవోలు మండ లంలోని ఆంజనేయపురం, శింగవరంలో చంద్రబాబునాయుడు నిర్మిం చిన టిడ్కో ఇళ్లను కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులకు అంది స్తాం. పెరవలిలో బస్టాండ్ నిర్మిస్తాం. పెరవలి ప్రభుత్వాసు పత్రిలో నేషనల్ హైవే వద్ద అడ్డుగా ఉన్న కటింగ్‌ను తొలగించి రోడ్డును అభివృద్ధిచేసి ప్రజలు, అరటి రైతులకు అనుకూలంగా మారుస్తాం. కానూరు-నడిపల్లి-తణుకు రోడ్డును ఆధునికీకరిస్తాం. ముక్కామల పెరవలి రహదారిని ఆధునికీకరిస్తాం.మర్రిపాలెం బ్రిడ్జిని విస్తరింప జేస్తాం. జగన్ పాలనలో నిడదవోలు నియోజకవర్గ పరిధి లోని రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. తమ కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల సమయంలోనే రోడ్ల నిర్మాణం చేపట్టడా నికి చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. 3 నెలల్లో నియోజకవర్గంలో రహదారులను అభివృద్ది పరుస్తామన్నారు.నిడదవోలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వారాహి విజయభేరి సభలో వారాహి వాహనంపై రెండు సింహాలు నిలబడ్డాయన్నారు. ఓపక్క నారా వారి సింహం, మరోపక్క కొణిదెల వారి సింహం అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్న వైసీపీని తరిమికొట్టేందుకు సిద్ధం గా ఉన్నాయన్నారు. రాష్ట్రం అన్ని విధా లా అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్‌లను కమలం, గాజు గ్లాసు గుర్తులపై ఓటేసి ప్రజలు ఆశీ స్సులు అందించాల న్నారు.నిడదవోలు వారాహి సభలో పట్టణ ప్రముఖ వైద్యులు. డాక్టర్ తోపరాల కల్యాణచక్రవర్తికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. నిడదవోలు పట్టణ వైసీపీ నాయకుడు గంటా శ్రీనివాస్, వైసీపీ మాజీ కౌన్సిలర్ గంటా నాగశాంతికుమారి తదితరులను పవన్ జనసేనలోకి ఆహ్వానించారు.
అడుగడుగునా అభిమానం
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాత్రి 7 గంటలకు ప్రజాగళం సభ ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రోడ్డు మార్గాన నిడదవోలు బహిరంగ సభకు బయలుదేరారు. తణుకులో రోడ్‌షో ముగిసిన తరువాత సుమారు 20 కిలోమీటర్లు ఒకే వాహనంపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు నిడదవోలు చేరుకున్నారు. సుమారు 8-43 గంటలకు నిడదవోలు సభావేదిక వద్దకు చేరుకున్నారు. వారాహి వాహనం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. నిర్ణీత సమయానికంటే గంటకు పైగా అధినేతల రాక ఆలస్యమైనప్పటికి జనం ఉత్సాహంగా రాత్రి 10 గంటల వరకు అక్కడు ఉండడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోకి వచ్చేసరికి వారికి ఇరుపార్టీల శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పాలంగి, ఉండ్రాజవరం, మోర్త, దమ్మెన్ను, కానూరు, డి.ముప్పవరం మీదుగా నిడదవోలు వెళ్లారు. ఉండ్రాజవరంలో మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు గన్నమని వెంకటసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. నిడదవోలు రూరల్ మండలం మునిపల్లి గ్రామంలో మహిళలు నేతలిద్దరిపై పూలు జల్లారు. డి.ముప్పవరంలో కూడ ప్రజలకు అభివాదం చేస్తూ సుమారు 7.45 గంటలకు నిడదవోలు పట్టణంలో గణేష్‌చౌక్ సెంటర్‌లో ఉన్న వారాహి విజయభేరి సభకు చేరుకున్నారు. ఉండ్రాజవరం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మోటార్ సైకిళ్లపై కాన్వాయ్ వెంట వచ్చారు. ఒకే వాహనంపై రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబు, పవన్‌లకు ప్రజలు విజయ సంకేతం చూపారు. 8.45 గంటలకు వారాహి వేదిక మీదకు వచ్చిన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. 8.45 గంటలకు ప్రారంభమైన వారాహి విజయభేరి సభ 9.50 గంటలకు ముగిసింది. 20 వేల మందికిపైగా జనం రాకతో వారాహి విజయభేరి సభ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి భోగవల్లి ప్రసాద్, సుజయ కృష్ణరంగారావు, గన్ని వీరాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణ, బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు.
పసుపు చంద్రయ్య
తెలుగుదేశం అంటే ప్రాణం. ఆనాడు అన్న ఎన్‌టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు ఎక్కడ టీడీపీ సభలు, సమావేశాలు జరిగినా అతను విధిగా హాజర వుతాడు.. అతని వస్త్రాలే కాదు.. బండి సైతం పసుపు మయం. చాగల్లు మండలం నందింగంపాడుకు చెందిన చిట్టూరి జలచంద్రయ్య బుధవారం నిడదవోలులో గణేష్‌చౌక్ సెంటర్‌లో జరుగుతున్న వారాహి విజయభేరి సభకు తాను మోటారుసైకిల్‌ను సైతం పసుపుమయం చేసుకుని జయహో చంద్రన్నా.... జయహో పవనన్నా.. అంటూ ఇలా సభకు తరలివచ్చాడు.
వారాహికి.. జన హారతి
నిడదవోలు : పవన్‌కల్యాణ్‌కే కాదు.. పవన్‌కల్యాణ్ వాహనం వారాహికి విశేష స్పందనే... నిడదవోలు గణేష్‌చౌక్ సెంటర్‌లో బుధవారం జరుగుతున్న వారాహి విజ యభేరి సభకు వచ్చిన వారాహి వాహనాన్ని తిలకించేందుకు అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ శ్రేణులు సాయంత్రం ఐదు గంటలకే పెద్దఎత్తున తరలివచ్చారు. తొలిసారి నిడదవోలు విచ్చేసిన వారాహి వాహనానికి అభిమానులు హారతులు పట్టారు. వారాహి వాహనం రాకతో నిడదవోలు గణేష్‌చౌక్ సెంటర్ అంతా సభ ప్రారంభానికి ముందుగానే జనసంద్రంగా మారింది.
రాత్రి బస ఇక్కడే..
నిడదవోలులోని శ్రీ తిరుమల సాయి కళ్యాణ మండపంలో చంద్రబాబు బుధవారం రాత్రి బస చేశారు. గురువారం ఉదయం జిల్లా నేతలతో సమీక్షించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళతా రు.జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కారులో బయలుదేరి రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్‌లో రాత్రి బస చేశారు.