Share News

AP Politics: ఛీ.. ఛీ.. మరీ ఇంత దుర్మార్గమా? సొంత పార్టీ నేత భార్యను సైతం..!

ABN , Publish Date - Mar 15 , 2024 | 09:07 AM

తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్‌ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్‌(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం.

AP Politics: ఛీ.. ఛీ.. మరీ ఇంత దుర్మార్గమా? సొంత పార్టీ నేత భార్యను సైతం..!
YSRCP Leader

కుప్పం, మార్చి 15: తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్‌ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్‌(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మొరసనపల్లెలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 5 ఎకరాల భూమిని గతంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఇందులో 64 సెంట్ల డీకేటీ భూమి కూడా ఉందని ఆరోపణలున్నాయి.

ఆ డీకేటీ భూమిలో కొంతభాగాన్ని వైసీపీ మండల కన్వీనర్‌ దండపాణి అనుచరుడు ఒకరు కొనుగోలు చేశారని చెబుతున్నారు. అయితే, ఆ భూమిలో గొర్రెల సంత ఏర్పాటు చేయాలని మొరసనపల్లె సర్పంచి జగదీశ్‌ భావించారు. అప్పటికే ఆ భూమి ఆక్రమణకు గురైందని తెలుసుకుని గతేడాది సెప్టెంబరులో గ్రామస్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో సర్పంచి భార్య నీలావతి ప్రముఖ పాత్ర పోషించారు. అదేనెలలోశాంతిపురం మీదుగా వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రాచమచంద్రారెడ్డి వాహనాన్ని సైతం ఆమె అడ్డుకుని నిరసన తెలిపారు. ఆ నిరసనలకు భయపడి ఎట్టకేలకు ఆ డీకేటీ భూమిని గొర్రెల సంత కోసం ఇచ్చేశారు. అప్పటి నుంచి నీలావతిపై అడపాదడపా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. గురువారం ఇది శృతి మించింది. రమేశ్‌ పీవీ పేరుతో రాయలేని భాషలో ఆమెపై ట్రోల్స్‌ వీరవిహారం చేశాయి.

దీనిపై నీలావతి సోషల్‌ మీడియాలో ఒక వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిజాన్ని నిర్భయంగా మాట్లాడడమే నా నేరమా? లిక్కర్‌ మాఫియా, క్వారీలను కొల్లగొట్టడం, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా చేస్తున్నా నేను పట్టించుకోలేదు. అయితే పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసినప్పటి నుంచే మండల అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. సాయంత్రమైతే చిల్లరకోసం క్వార్టర్‌ మందుకు పడేవాళ్లను నాయకులుగా నమ్ముతున్నాం. ఇది మన దౌర్భాగ్యం’ అని ఆ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 09:07 AM