Share News

AP News: రేణిగుంట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శోభారాణిపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:17 PM

ఏపీలో ప్రభుత్వ మారటంతో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలకు వత్తాసు పలికిన పలు ప్రభుత్వ అధికారులపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అవకతవకలకు పాల్పడిన అధికారుల వ్యవహరం బయటకు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

AP News: రేణిగుంట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శోభారాణిపై  సస్పెన్షన్ వేటు

తిరుపతి: ఏపీలో ప్రభుత్వ మారటంతో పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలకు వత్తాసు పలికిన పలు ప్రభుత్వ అధికారులపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అవకతవకలకు పాల్పడిన అధికారుల వ్యవహరం బయటకు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా రేణిగుంట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శోభారాణిపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు పడింది. సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో స్టాంపులు అమ్మి రూ. 21 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు.


వైసీపీ సలహాదారుడి మనిషిగా విచ్చలవిడిగా పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. దీంతో ఆమైపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించారు. అధికారుల నిఘాలో ఆమె పట్టుబడింది. వైసీపీ నేతలు ఆమె కనుపన్నల్లో పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలకు గుట్టుచప్పుడు కాకుండా శోభారాణి పలు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మారటంతో ఆమె చేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఆమెను సస్సెండ్ చేస్తూ , ముందస్తు సమాచారం లేకుండా తిరుపతి జిల్లాను వీడి వెళ్లటానికి వీలులేదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jun 08 , 2024 | 10:17 PM