Share News

Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Mar 20 , 2024 | 08:33 AM

తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. పిల్లలకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) గణనీయంగా తగ్గిపోయింది. నిన్నటి నుంచి భక్తులకు వేచి ఉండే అవకాశం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

తిరుమల: తిరుమల (Tirumala)కు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. పిల్లలకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) గణనీయంగా తగ్గిపోయింది. నిన్నటి నుంచి భక్తులకు వేచి ఉండే అవకాశం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. మంగళవారం స్వామివారిని 63251 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై స్వామివారు విహరించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేయనుంది.

Tirumal News: నేడు తిరుమలకు నారా కుటుంబం..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 08:33 AM