Share News

Tirumal News: నేడు తిరుమలకు నారా కుటుంబం..

ABN , Publish Date - Mar 20 , 2024 | 08:04 AM

Nara Devansh Birthday: నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబ సమేతంగా తిరుపతికి(Tirupati) రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం నాడు లోకేష్-బ్రాహ్మణి(Lokesh-Brahmani) దంపతుల తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నారా ఫ్యామిలీ మొత్తం తిరుమలకు రానున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇవాళ సాయంత్రం తిరుమలకు చేరుకోనుండగా..

Tirumal News: నేడు తిరుమలకు నారా కుటుంబం..
Nara Chandrababu Family

Nara Devansh Birthday: నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబ సమేతంగా తిరుపతికి(Tirupati) రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం నాడు లోకేష్-బ్రాహ్మణి(Lokesh-Brahmani) దంపతుల తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నారా ఫ్యామిలీ మొత్తం తిరుమలకు రానున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇవాళ సాయంత్రం తిరుమలకు చేరుకోనుండగా.. నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రను ముగించుకొని రాత్రికి తిరుమలకు చేరుకుంటారు. రాత్రికీ తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం శ్రీవారిని దర్శించుకుని.. టీటీడీ ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏటా తిరుమలలో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నదానం చేస్తున్నారు లోకేష్ ఫ్యామిలీ.

తిరుమలలో తెప్పోత్సవాలు..

తిరుమలలో నేటి నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. శ్రీరామ సమేత సీతా, లక్ష్మణ, అంజనేయస్వామి బుధవారం సాయంత్రం శ్రీవారి పుష్కరిణిలో తెప్పలపై విహరించనున్నారు. తెప్పోత్సవాల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 08:04 AM