Share News

Btech Ravi: వివేకా హత్యపై ఎవరూ మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు..

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:55 PM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, పెండింగ్ కేస్‌లపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో టీడీపీ నేత బీటెక్ రవి అప్పీల్ చేశారు. అప్పీల్‌ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ముందుంచారు. ఈ అప్పీల్‌పై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

Btech Ravi: వివేకా హత్యపై ఎవరూ మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు..

అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య, పెండింగ్ కేస్‌లపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో టీడీపీ (TDP) నేత బీటెక్ రవి అప్పీల్ చేశారు. అప్పీల్‌ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ముందుంచారు. ఈ అప్పీల్‌పై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. తొలుత ఈ పిటిషన్‌ను తాము విచారించలేనని , రేపు మరో ధర్మాసనం చేపడుతుందని బెంచ్ పేర్కొంది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కు , పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటిషన్‌లో బీటెక్ రవి పేర్కొన్నారు.

CM Jagan: జగన్‌పై కూటమి నేతల ఫిర్యాదు.. షాకిచ్చిన ఈసీ!


ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం బ్లూమ్ బర్గ్ కేస్ లో ఇచ్చిన తీర్పుకు కూడా ఇది పూర్తి విరుద్ధమని సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ పేర్కొన్నారు. ప్రతివాదులు లేకుండా ఉత్తర్వులు ఇలా జారీ చేయకూడదని మురళీధర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. వివేకా కేసుపై ఎవరూ మాట్లాడొద్దని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి...

YSRCP: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్

Puzzle: తెలివైన వాళ్లు కూడా ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టలేకపోయారు.. మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!

Read More AP News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 01:55 PM