Share News

మెగా డీఎస్సీపై తొలి సంతకం ఈ పెన్నుతోనే!

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:10 AM

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు.

మెగా డీఎస్సీపై తొలి సంతకం ఈ పెన్నుతోనే!

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం: చంద్రబాబు

పవన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన రద్దు

నేడు పిఠాపురంలోనామినేషన్‌

జాబు రావాలంటే బాబు రావాలి.. గంజాయి కావాలంటే జగన్‌ రావాలి

ఈ సీఎంను సవాల్‌ చేస్తున్నా..1న సచివాలయాల సిబ్బందిని

ఇంటింటికీ పంపి పింఛన్లు ఇప్పించాలి.. మేం రాగానే 4 వేలు ఇంటికే వచ్చి ఇస్తాం

పెంచిన మొత్తం ఏప్రిల్‌ నుంచే అమలు.. పేదలకు 2-3 సెంట్ల ఇంటి స్థలం

ఉచితంగా టిడ్కో ఇళ్లు.. మహిళలూ.. టీడీపీ వస్తే ఎంత లాభమో లెక్కలేసుకోండి

ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. దుర్మార్గుడు మళ్లీ వస్తే మన గతేంటి?

విధ్వంసం, దోపిడీయే జగన్‌ విధానాలు.. పవన్‌ కాలిగోటికి కూడా సరిపోడు

13న హుద్‌హుద్‌ కంటే పెద్ద తుఫాను.. వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: బాబు

కాకినాడ/విజయనగరం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో నన్ను కలిసినప్పుడు నాకో పెన్ను ఇచ్చింది. ఆ పెన్నుతో నేను సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరింది. కచ్చితంగా అలాగే చేస్తా’ అని ప్రకటించారు. టీడీపీ వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం భయంకర నేరస్థుల వెళ్లిపోయి నష్టపోతోందన్నారు. జగన్‌లాంటి దుర్మార్గుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల గతేంటో అందరూ ఆలోచించాలన్నారు. అసలే కోతి.. ఆపై కళ్లు తాగిన చందాన ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. రా ష్ట్రంలో తానొక్కడే శాశ్వతం అనుకుని జగన్‌ ప్రవర్తిస్తున్నా డు. సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన చిరంజీవి, డైరెక్టర్‌ రాజమౌళి వంటివారిని ఇంటికి పిలిచి అవమానించిన నీచుడు. సజ్జల రామకృష్ణారెడ్డి సైతం చిరంజీవి ని విమర్శిస్తున్నారు.

వీళ్ల బలుపు తగ్గించే అస్త్రం టీడీపీ దగ్గ ర ఉంది. వైసీపీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ టీడీపీ. అందుకే జాబు రావాలంటే బాబు రావాలి. కానీ గంజాయి కావాలంటే జగన్‌ రావాలి. జగన్‌కు ఒకటే చాలెంజ్‌ చేస్తున్నా. వచ్చే నెల 1న వలంటీర్లను కాకుండా సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ నేరుగా నెలకు రూ.4 వేల పింఛను ఇస్తాం. పెంచిన మొత్తం ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తాం. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటి స్థలం అందిస్తాం. టిడ్కో ఇళ్లను ఉచితంగా పంపిణీ చేస్తాం. 3 గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరున్నా ప్రోత్సహిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్థికంగా ఎంత లాభమో మహిళలు లెక్కలు వేసుకోండి. ఇది పరీక్షా సమయం. ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

పవన్‌ కాలిగోటికి కూడా సరిపోడు..

సీఎం జగన్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను బూతు లు తిడుతున్నారు. ఎంత నీచం! అసెంబ్లీలో నా భార్యను కూడా తిట్టారు. అయినా పవన్‌ ఎక్కడ.. జగన్‌ ఎక్కడ? పవర్‌ స్టార్‌ కాలిగోటికి కూడా సరిపోడు. నేను కూడా జగన్‌ బాధితుడినే. నాజోలికి రావడానికి ఎవరైనా భయపడతా రు. కానీ సైకో కావడం వల్ల జగన్‌ భయపడలేదేమో! అటు ఎంపీ రఘురామరాజును కూడా చంపించాలని చూశాడు. తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపైనా సోషల్‌ మీడియా ద్వారా దాడి చేయించారు. అలా దాడిచేసిన వారిని ఇప్పుడు పక్కనపెట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే జగన్‌ ప్రవర్తన గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రాష్ట్రంలో పెరుగు, మీగడ తను తినేసి మజ్జిగ జనాలకు పోస్తున్నాడు. రాజధాని అమరావతిని దెబ్బతీశాడు. అలాంటి జగన్‌కు ఓట్లు వేయించుకునే అర్హత లేదు. వస్తున్నది కురుక్షేత్ర యుద్ధం.. ధర్మమే గెలుస్తుంది. మే 13న హుద్‌హుద్‌ తుఫా ను కంటే భారీ తుఫాను రాబోతోంది. ఇం దులో వైసీపీ కొట్టుకుపోతుంది. కూటమి ఉమ్మడి సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనం. ఎన్డీయే ప్రభుత్వంతోనే ప్రశాంతత లభిస్తుంది. వైసీపీ మాటలు విని వలంటీర్లు రాజీనామా చేయొద్దు.

మల్లన్న సన్నిధిలో చంద్రబాబు దంపతులు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు సోమవారం దర్శించుకున్నా రు. అనంతరం, అతిథి గృహంలో శ్రీశైలం, రాయదుర్గం, బనగానపల్లె, కదిరి అభ్యర్థులు బుడ్డా రాజశేఖరరెడ్డి, కాలువ శ్రీనివాసులు, బీసీ జనార్దన్‌రెడ్డి, కందికుంట ప్రసాద్‌కు చంద్రబాబు బీ-ఫాంలు అందజేశారు.

జగన్‌ అహంకారానికి సైకోయిజం కూడా తోడైంది. అసలు తనేం చేస్తాడో అతడికే తెలియదు. రాయితో మనల్ని కొడతాడు. చెల్లెల్ని కొడతాడు. చివరకు అదే రాయితో తనను తాను కొట్టుకుంటాడు.

దోపిడీదారులు ఇళ్లలోకి వస్తే ఏం చేస్తాం.. చేతికి ఏది దొరికితే అది పట్టుకుని తరిమికొడతాం. అలాగే బందిపోటు దొంగ జగన్‌ను కూడా తరిమికొట్టి రాష్ట్రాన్ని అంతా కలిసి కాపాడుకోవాలి.

- చంద్రబాబు

చంద్రబాబుతో నల్లమిల్లి భేటీ

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జగ్గంపేట ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడారు. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో తనకు జరిగిన అన్యాయంపై నల్లమి ల్లి పోరాడుతున్నారు. టీడీపీకే ఈ సీటు ఇవ్వాలని కోరు తూ యాత్ర చేపట్టారు. దీంతో బీజేపీ అనపర్తి సీటుని టీడీపీకి వదులుకోవడానికి సిద్ధమైంది. బదులుగా బీజేపీకి కేటాయిస్తారన్న స్థానంపై టీడీపీ నుంచి సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాను అనపర్తి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగుతానని నల్లమిల్లి.. చంద్రబాబుకి చెప్పారు. బీజేపీకి ఇచ్చే సీటుపై వేగంగా నిర్ణ యం తీసుకోవాలని కోరారు. దీనిపై ఒకటి, రెండు రోజు ల్లో నిర్ణయం తీసుకుంటానని బాబు హామీ ఇచ్చారు.

కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో శాంత్రిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. ‘ కుప్పం లో అధికార పార్టీ వైసీపీ చట్టవిరుద్ధమైన పద్ధతులను అవలంభిస్తోంది. గత ఐదేళ్లూ టీడీపీ నేతలను ప్రభు త్వం వేధించింది. ఇప్పుడు కూడా కొంత మంది అధికారులు కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసి, ఓటర్లను ప్రభావితం చేయాలని వైసీపీ యోచిస్తోంది. ఏ సంఘటన జరిగినా వీడియోలతో చిత్రీకరించే ఏర్పాట్లు చేయాలి’ అని కోరారు.

Updated Date - Apr 23 , 2024 | 05:10 AM