Share News

AP Politics: ఎన్నికల వేళ జగన్‌కు నాన్‌స్టాప్ షాక్‌లే.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే జంప్..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:29 AM

Andhra Pradesh: వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్‌కు(YS Jagan) వరుస షాక్‌లు ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. 175 ఏమో గానీ.. అసలు లెక్కలో ఉంటారా? ఉండరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YSRCP) నుంచి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండగా.. ఇప్పుడు మరికొందరు నేతలు ఆ బాటలో పయనిస్తున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) వైసీపీకి రాజీనామా చేశారు.

AP Politics: ఎన్నికల వేళ జగన్‌కు నాన్‌స్టాప్ షాక్‌లే.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే జంప్..!

Andhra Pradesh: వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్‌కు(YS Jagan) వరుస షాక్‌లు ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. 175 ఏమో గానీ.. అసలు లెక్కలో ఉంటారా? ఉండరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YSRCP) నుంచి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండగా.. ఇప్పుడు మరికొందరు నేతలు ఆ బాటలో పయనిస్తున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) వైసీపీకి రాజీనామా చేశారు. కడపలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరారు. బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. శుక్రవారం నాడు కూడా పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని వీడారు. వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా వరుసగా నేతలు పక్క పార్టీల వైపు చూస్తుండటంతో.. వైసీపీ అగ్ర నేతలు ఆగమాగం అయిపోతున్నారు. వలసలు ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.


ధర్మవరంలో వైసీపీకి ఝలక్..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీకి బిగ్ ఝలక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. వరుసబెట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ చేనేత నాయకుడు గిర్రాజు నాగేష్ వైసీకి రాజీనామా చేశారు. ఇవాళ ముదిగుబ్బ మండలం ఎంపీపీ, ఎమ్మెల్యే వెంకట్రాం రెడ్డి ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. బలహీవర్గాలకు న్యాయం జరగడం లేదని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 10 సీట్లు రెడ్లకు ఇచ్చారని నేతలు ఆరోపించారు. పదవులన్నీ రెడ్డి క్యాస్ట్ కే వస్తున్నాయని బీసీ నేతలు వైసీపీనీ వరసగా వీడుతున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2024 | 11:39 AM