Share News

Bhuvaneswari: అనంతలో ఏయే ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తారంటే?

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:07 AM

Telangana: జిల్లాలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈరోజు పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించి టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మనస్థాపం చెంది మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Bhuvaneswari: అనంతలో ఏయే ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తారంటే?

అనంతపురం, మార్చి 7: జిల్లాలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈరోజు పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించి టీడీపీ (TDP) కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మనస్థాపం చెంది మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ‘‘నిజం గెలావాలి’’ పేరుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి కలుస్తున్నారు. ఈరోజు అనంతలో ఆరుగురురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఉదయం అనంతపురం ఎం.వై.ఆర్. కళ్యాణ మండపం నుంచి పర్యటన ప్రారంభంకానుంది.

APPSC: జగన్ ప్రభుత్వంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్ సంచలన వ్యాఖ్యలు


పర్యటన షెడ్యూల్ వివరాలు..

• 11:15 – గుంతకల్లు నియోజకవర్గం, గుత్తి మండలం, ధర్మాపురం గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

• 11:50 – గుంతకల్లు నియోజకవర్గం, గుత్తి మండలం, బేతపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

• 01:40 – పత్తికొండ నియోజకవర్గం, తుగిలి మండలం, మీటే తండా గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

• 02:35 – పత్తికొండ నియోజకవర్గం, కడమకుంట్ల గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

• 04:30 – పత్తికొండ నియోజకవర్గం, కృష్ణగిరి మండలం, ఎర్రగుడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

• 06:25 – ఆలూరు నియోజకవర్గం, ఆస్పరి మండలం, హలిగేరి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

• 07:30 – పత్తికొండ నియోజకవర్గం, గోపాల ప్లాజా వద్ద రాత్రి బస.

ఇవి కూడా చదవండి...

BJP: కోర్ గ్రూప్ భేటీల్లో ఏపీలో పొత్తులపై బీజేపీ ప్రస్తావన

YCP: నేడు ముద్రగడ ఇంటికి వైసీపీ కీలక నేతలు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 10:26 AM