Share News

AP Election 2024: రాక్షస పాలనను అంతం చేయడమే లక్ష్యం.. సీఎం జగన్‌పై కూటమి నేతల ఆగ్రహం

ABN , Publish Date - Apr 08 , 2024 | 05:49 PM

రాక్షస (వైసీపీ) పాలనను అంతం చేయడమే తెలుగుదేశం - జనసేన - బీజేపీ లక్ష్యమని కూటమి నేతలు తెలిపారు. సోమవారం నాడు ప్రజా మ్యానిఫెస్టో‌పై కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన సీనియర్ నేత గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 AP Election 2024: రాక్షస పాలనను అంతం చేయడమే లక్ష్యం.. సీఎం జగన్‌పై కూటమి నేతల ఆగ్రహం

అమరావతి: రాక్షస (వైసీపీ) పాలనను అంతం చేయడమే తెలుగుదేశం - జనసేన - బీజేపీ లక్ష్యమని కూటమి నేతలు తెలిపారు. సోమవారం నాడు ప్రజా మ్యానిఫెస్టో‌పై కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన సీనియర్ నేత గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సీఎం జగన్ (CM Jagan), వైసీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ను ఏపీ నుంచి తరిమి కొడతాం: వర్లరామయ్య

టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీలు కలిసింది రాక్షసుడు(జగన్)ని ఏపీ నుంచి తరిమికొట్టేందుకేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...


Varla-Rramaiah.jpg

రామరాజ్యం కోసం కూటమి ఏర్పడిందని చెప్పారు. కూటమికి ప్రజల్లో మద్దతు పెద్ద ఎత్తున ఉందని చెప్పారు. కూటమి మ్యానిఫెస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం ప్రజా అభిప్రాయాలను ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ - 8341130393లో తెలియజేయవచ్చని కోరారు.


ప్రజల సూచనలు, సలహాలను గౌరవంగా స్వీకరిస్తామన్నారు. ఈ ప్రాధాన్యత అభిప్రాయాలను మ్యానిఫెస్టోలో పొందుపరు స్తామన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం, రాక్షసుడి(జగన్)ని తరిమి కొట్టేందుకు ప్రజలు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలపాలని అన్నారు. రాక్షస(వైసీపీ) పాలనను అరికట్టేందుకు కూటమి చేస్తున్న మహాయజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని వర్లరామయ్య పిలుపునిచ్చారు.


AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజా సంక్షేమం, ఏపీ అభివృద్ధే కూటమి లక్ష్యం: లంకా దినకర్

ప్రజా సంక్షేమం, ఏపీ అభివృద్ధే కూటమి లక్ష్యమని బీజేపీ (BJP) అధికార ప్రతినిధి లంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందించడమే కూటమి లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్ సుసాధ్యం అయ్యేది వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనేనని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దుర్యోధన, నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

Lanka-Dinakar.jpg


ప్రజా సంక్షేమం కోసమే ప్రజా మ్యానిఫెస్టోను తయారు చేస్తున్నామన్నారు. విద్రోహ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాక్షస సంహారానికి త్రిమూర్తులుగా కూటమి జనం ముందుకు వస్తుందన్నారు. ప్రజా మ్యానిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని లంకా దినకర్ తెలిపారు.


ఏపీ భవిష్యత్ కోసమే కూటమి: వెంకటేశ్వరరావు

Gade-Venkateswara-Rao.jpg


ఏపీ భవిష్యత్ కోసం కూటమి ఏర్పడిందని జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateswara Rao) తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నామని వెంకటేశ్వరరావు అన్నారు.


ఇవి కూడా చదవండి

Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 06:01 PM