Big Breaking : తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు..

ABN , First Publish Date - 2023-07-25T21:22:30+05:30 IST

తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. .

Big Breaking : తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు..

తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (బుధ, గురువారం) రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.


Holidays.jpg

వాతావరణ సూచనతో..

26, 27 తారీఖుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే.. మంగళవారం, బుధవారం, గురువారం మూడ్రోజులు సెలవులు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంఘాల నేతలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్, సీఎంవో, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, హరీష్‌రావులను ట్యాగ్ చేస్తూ వేలాది ట్వీట్లు చేశారు. వాస్తవానికి సోమవారం సాయంత్రమే సెలవుల విషయమై విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమాలోచనలు చేసిన కేసీఆర్ పరిస్థితిని బట్టి సెలవులపై నిర్ణయం తీసుకోవాలని భావించారట. అయితే మంగళవారం సాయంత్రం నుంచే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవే వర్షాలు రెండ్రోజులు కంటిన్యూగా పడతాయని వాతావరణ శాఖ తేల్చిచెప్పడంతో రేపు, ఎల్లుండి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Half-Day-Schools-in-Telanga.jpg


ఇవి కూడా చదవండి


Rains lash Telangana : వదలనంటున్న వర్షాలు.. తెలంగాణలో రేపు, ఎల్లుండి సెలవులు..!?


Rains lash Telangana : తెలంగాణలో మూడ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..!?


TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!


Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..


AP Politics : ఏపీ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్.. వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్..!


Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?


Updated Date - 2023-07-25T21:42:51+05:30 IST