Rains lash Telangana : తెలంగాణలో మూడ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..!?

ABN , First Publish Date - 2023-07-24T19:33:41+05:30 IST

తెలంగాణలో వర్షాలు (TS Rains) దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో (Hyderabad) పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రానున్న మూడ్రోజులు హైదరాబాద్‌తో పాటు పలు నాలుగైదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది...

Rains lash Telangana : తెలంగాణలో మూడ్రోజులపాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..!?

తెలంగాణలో వర్షాలు (TS Rains) దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో (Hyderabad) పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రానున్న మూడ్రోజులు హైదరాబాద్‌తో పాటు పలు నాలుగైదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది.! రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు మూడ్రోజులపాటు (మంగళవారం, బుధవారం, గురువారం) సెలవులు (Holidays) ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వర్షాల పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలతో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. విద్యాశాఖ ఉన్నతాధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) సీఎం కేసీఆర్ (CMKCR) సెలవుల విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇవాళ 9 గంటలలోపు సెలవుల విషయమై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంగళవారం ఉదయం వర్షం ప్రారంభం అయ్యాక హడావుడిగా సెలవులు ప్రకటించడం కంటే ఇవాళ రాత్రే సెలవులపై ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


rains-warangal.jpg

ఆదివారం నుంచే ఇలా..!

వర్షాలు రోజురోజుకూ ఎక్కువవుతుండటం, ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితుల్లేకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నాడు స్కూళ్లు నడిచినప్పటికీ వర్షం పడక ముందే విద్యార్థులు క్షేమంగానే ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం నుంచి మళ్లీ వర్షం పడుతుండటం, రానున్న మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను స్కూళ్లకు పంపడం అస్సలు అయ్యే పనే కాదని వర్షం ఉన్నన్ని రోజులు సెలవులు ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎంవో, విద్యాశాఖ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ట్యాగ్ చేస్తూ సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నుంచే ఇలా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. సోమవారం మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో ‘సెలవులు ఇవ్వండి మహాప్రభో’ అని కొందరు.. ‘ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి సెలవులివ్వాలి’ అని మరికొందరు తల్లిదండ్రులు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండటంతో ఈ క్రమంలో ప్రభుత్వం మంగళ, బుధ, గురువారాలుసెలవులు ప్రకటించాలని.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కొనసాగించాలా..? వద్దా అనేదానిపై ఆలోచించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ap-govt-schools.jpg


ఇవి కూడా చదవండి


Telangana Rain Alert : తెలంగాణ ప్రజలారా.. ఈ మూడ్రోజులు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


Telangana Weather Updates : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు


TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!


Pension Hike In TS : శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్.. పింఛన్ పెరిగింది.. ఒకేసారి..


Rains lash Telangana : వదలనంటున్న వర్షాలు.. తెలంగాణలో రేపు, ఎల్లుండి సెలవులు..!?


Updated Date - 2023-07-24T19:37:22+05:30 IST