KTR: మోదీకి ఆస్కార్ వస్తది! ప్రధానిపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ABN , First Publish Date - 2023-03-15T16:01:16+05:30 IST

మోదీ మహానటుడు.. అందుకే ఆయనకు ఆస్కార్ (Oscar) వస్తది. బాత్ కరోడ్‌ మే.. కామ్ పకోడ్‌ మే.. లెక్కన ఉంది ఆయన

KTR: మోదీకి ఆస్కార్ వస్తది! ప్రధానిపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సెటైర్లు

కామారెడ్డి: ప్రధాని మోదీ (MODI) పై మరోసారి మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. దేశంలో మోదీ అనే మహా నటుడు ఉన్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పిట్లం బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ‘‘మోదీ మహానటుడు.. అందుకే ఆయనకు ఆస్కార్ (Oscar) వస్తది. బాత్ కరోడ్‌ మే.. కామ్ పకోడ్‌ మే.. లెక్కన ఉంది ఆయన తీరు. సిలిండర్ ధర పెంచి హామీ తప్పిన ప్రధానిని ఏమనాలి?. మోదీని దేవుడు అంటున్నాడొకాయన.. ఆయన ఎవరికి దేవుడు?.. నీకా.. అదానీకా?. దేశ సంపద వారే దోచుకుని ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ (Congress) నేతలు మళ్లీ ఒక్క అవకాశం అంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పండ్లు తోమారా?.’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-15T16:02:19+05:30 IST