Bhatti Vikramarka: కేసీఆర్ ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-01T22:08:53+05:30 IST

సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు.

Bhatti Vikramarka: కేసీఆర్ ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారు

ఖమ్మం: సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. ఆదివారం నాడు కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..‘‘మంత్రి కేటీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లారు. కేటీఆర్ కొంచెం చదువుకున్నారు జ్ఞానం ఉంటుంది కదా మంచిగా మాట్లాడతారు అనుకున్నాను కానీ ఆయన మాట్లాడే బాష బాగాలేదు. కేటీఆర్ ఖమ్మం జిల్లాకు వచ్చారు ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి, ఇచ్చే హామీలు ఏంటో ప్రజలకు చెప్పాలి. మీరు జిల్లాకు చేసింది ఏమి లేదు కాబట్టి జిల్లాకు రావాలంటే భయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరిని అరెస్ట్ చేయించారు. నేను నీ కంటే ఎక్కువగా మాట్లాడగలను కానీ నేను ఖమ్మం జిల్లా వాసిగా సభ్యత సంస్కారం తెలిసిన వ్యక్తిని. సంపద కలిగిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు. 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చేయకుండా ఉంటే మీరు ఖమ్మం రావడానికి గుర్రం బండి ఎక్కాల్సి వచ్చేది. ప్రపంచంలో పోటీ పడటానికి కంప్యూటర్ రెవల్యూషన్‌కు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తినడానికి తిండి లేకపోతే అనేక ప్రాజెక్ట్‌లు కట్టి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దేశాన్నితీసుకు వచ్చింది మీ పార్టీలా కాంగ్రెస్ పార్టీ భూములు అమ్మకానికి పెట్టలేదు. గత పాలకులు ఎవరు పోలీసులను పెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేయించలేదు. వారే అలా ప్రవర్తిస్తే మీ పార్టీ ఉండేది కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారు. మీలా హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేయలేదు. మీరేన్ని మీటింగ్‌లు పెట్టిన ప్రజలు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. మీ బెదిరింపులకు ప్రజలు తగిన సమాధానం చెప్తారు’’ అని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

Updated Date - 2023-10-01T22:08:53+05:30 IST