Talasani: తలసాని కీలక వ్యాఖ్యలు.. జగన్‌ చేసిన..

ABN , First Publish Date - 2023-02-15T17:06:00+05:30 IST

ద్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు.

Talasani: తలసాని కీలక వ్యాఖ్యలు.. జగన్‌ చేసిన..

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని మంత్రి తలసాని అన్నారు, కానీ తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవానికి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS)కు ప్రత్యామ్నాయ పార్టీ లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

కడప (Kadapa) జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. అలాంటప్పుడు అక్కడ ఈ కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారని తలసాని ప్రశ్నించారు. అక్కడ వాళ్లకు అనుమతి ఇచ్చారని తమకు ఎలాంటి ఈర్ష్య లేదని తలసాని స్పష్టం చేశారు. ఈ ఒక్క ఉదాహరణతో వ్యవస్థలు ఏ పద్ధతిలో నడుస్తున్నాయో చూడొచ్చని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 17 చేపట్టాలని భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుందని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిందని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13న ఎన్నికలు జరుగన్నాయి. మార్చి 16న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నూతన సచివాలయ ప్రారంభోత్స తేదీని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2023-02-15T17:09:06+05:30 IST