Kavitha: బీఆర్ఎస్‌లో ఎలా చేరాలని కవితను అడిగిన వీరాభిమాని.. ఆమె ఇచ్చిన రిప్లై చూసి...

ABN , First Publish Date - 2023-02-20T10:22:35+05:30 IST

బీఆర్‌ఎస్ పార్టీలో ఎలా చేరాలి అంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర నుంచి ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా అడిగారు.

Kavitha: బీఆర్ఎస్‌లో ఎలా చేరాలని కవితను అడిగిన వీరాభిమాని.. ఆమె ఇచ్చిన రిప్లై చూసి...

హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party)లో ఎలా చేరాలి అంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర (Maharashtra) నుంచి సాగర్ అనే అభిమాని (Fan) ట్విట్టర్ (Twitter) వేదికగా అడిగారు. దీనిపై కవిత(BRS MLC) స్పందిస్తూ... దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ (BRS) బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్‌ (CM KCR)కు మద్దతు పలకాలని సూచించారు. తెలంగాణ (Telangana) మాదిరిగా దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (Ab Ki Bar Kisan Sarkar) ఏర్పడాలంటే కేసీఆర్ (KCR) నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం కేసీఆర్ (Telangana CM) నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్‌ (Nanded)లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని.. అది కేసీఆర్‌ (BRS Chief)తోనే సాధ్యమనే నమ్మకమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

ముంబైకి కవిత...

మరోవైపు ఈనెల 25న ముంబై (Mumbai)కి కవిత వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ‘‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023’’ పేరిట జరుగనున్న సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొననున్నారు. ‘‘2024 ఎన్నికలు-విపక్షాల వ్యూహం’’ అనే అంశంపై జరుగనున్న చర్చలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బీఆర్‌ఎస్ జాతీయ అజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు (Rythu Bandhu) , దళితబంధు (Dalit Bandhu), రైతు బీమా (Rythu Bima) వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది (Shiv Sena MP Priyanka Chaturvedi), ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా (AAP MP Raghava Chadha), తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితాదేవ్‌ (Trinamul Congress MP Sushmitadev) ఈ సదస్సులో పాల్గొననున్నారు.

Updated Date - 2023-02-20T10:52:59+05:30 IST